Cinema Viral: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మే 27న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఆర్మీ అధికారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘ బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్, టీవీ హోస్ట్ శిబానీ దండేకర్ ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఫర్హాన్ తండ్రి జావెద్ అక్తర్ వెల్లడించాడు. కరోనా కారణంగా వివాహం కొద్దిమంది సమక్షంలోనే జరపనున్నట్లు చెప్పాడు. కాగా, నాలుగేళ్లుగా ఫర్హాన్, శిబానీ డేటింగ్ లో ఉన్నారు. మొత్తానికి మరో ప్రేమ జంట ఒకటి కాబోతుంది.
Also Read: ట్రైలర్ టాక్ : ‘గంగూభాయ్’లా అలియా అదరగొట్టింది.. ‘రోజు రాత్రి ఇజ్జత్ అమ్ముతాం’

అలాగే మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట నిర్మాత సురేశ్‌బాబు. రీమేక్ రైట్స్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట.

కాగా వీరిద్దరూ కలిసి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరి ఈ ఫ్యామిలీ డ్రామా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తమ్మీద బాబాయ్ అబ్బాయ్ కలిసి వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read: ప్రియాంక చోప్రాకి మరో క్రేజీ ఆఫర్.. ఆమె నెంబర్ వన్