Nagarjuna Isha Koppikar controversy: ఓ మూవీ షూటింగ్ లో హీరో నాగార్జున కొట్టాడని షాకింగ్ మేటర్ రివీల్ చేసింది ఓ సీనియర్ హీరోయిన్. ఆయన కొట్టిన చెంప దెబ్బలకు ఆమె ముఖం వాచిపోయిందట. నాగార్జున చేతి వేళ్ళు ఆమె చెంపల మీద పడ్డాయట. అసలు ఎందుకు నాగార్జున ఆ హీరోయిన్ ని అంతలా ఎందుకు కొట్టారో చూద్దాం..
Also Read: విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగ పెద్ద ప్లాన్..?
1997లో విడుదలైన వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది నార్త్ భామ ఇషా కొప్పికర్. ఆ సినిమాలో ఇషాది గెస్ట్ రోల్. వినీత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించడం విశేషం. రెండో చిత్రం చంద్రలేఖ. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. రమ్యకృష్ణ, ఇషా హీరోయిన్స్ గా నటించారు. అనంతరం తమిళ్, కన్నడ భాషల్లో చిత్రాలు చేస్తూ ప్రేమతో రా చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించింది. ప్రేమతో రా తర్వాత ఆమె హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితం అయ్యింది.
చాలా గ్యాప్ తర్వాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన కేశవ చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేయడం కొసమెరుపు. గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ఆయలాన్ లో ఓ పాత్ర చేశారు. తాజాగా ఇషా కొప్పికర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రలేఖ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది. ఈ సినిమాలో హీరో నాగార్జున ఇషా కొప్పికర్ చెంపపై కొట్టే సీన్ ఉందట. నాగార్జున సున్నితంగా కొట్టి షాట్ ఓకే చేద్దాం అన్నాడట. అయితే సహజంగా రావడం కోసం నిజంగానే గట్టిగా కొట్టమని ఇషా కోరిందట.
Also Read: పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎంత వరకూ వచ్చింది..?టీజర్ కథేంటి..?
నాగార్జున వద్దని చెప్పినా ఇషా వినలేదట. దాంతో నాగార్జున నిజంగానే ఇషా చెంపపై గట్టిగా కొట్టాడట. ఆ టైం లో ఇషా కోపంగా చూసే ఎక్స్ప్రెషన్ సరిగా రాలేదట. దాంతో ఆ షాట్ ఓకే కావడానికి 14 టేకులు తీసుకున్నారట. ఇషాను అన్నిసార్లు నాగార్జున చెంపపై గట్టిగా కొట్టాడట. షాట్ ముగిశాక చూస్తే ఇషా చెంప ఎర్రగా కందిపోయిందట. నాగార్జున చేతి ముద్రలు కూడా ఆమె బుగ్గపై పడ్డాయట. ముఖం వాచిపోయిందట. ఇషాకు నాగార్జున సారీ చెప్పాడట.
అయ్యో సారీ చెప్పకండి, నేను అడిగితేనే కదా కొట్టారు.. అని ఇషా అన్నారట. అదన్నమాట మేటర్. మలయాళ చిత్రం చంద్రలేఖకు రీమేక్ గా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తెలుగులో ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఒరిజినల్ కి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. చంద్రలేఖ చిత్రానికి నాగార్జున నిర్మాత కావడం విశేషం.