Vijay Devarakonda: తెలుగు స్టార్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల హాట్ టాపిక్ గా మారాడు. ఆయన ఏం చేసినా న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ నటించిన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ సందర్భంగా ఆయనపై రకరకాల పోస్టులు పెట్టి సందడి చేశారు. అయితే విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగతా సినిమాల మేకింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. కానీ ఈ మధ్యలో ఆయన రష్మితో కలిసి మాల్దీవులు వెళ్లడం షాక్ తెప్పించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏముంది..? అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు పెట్టారు. వారు వెళ్లి తిరిగి వచ్చిన ఫొటోలపై కూడా నెటిజన్లు హాట్ కామెంట్స్ చేశారు. ఇంతలో విజయ్ దేవరకొండ ఆర్మీలో చేరారా..? అనే వార్త గుప్పుమంటోంది..ఇంతకీ అసలు విషయమేంటంటే..?

చేతిలో గన్.. ఆర్మీ డ్రెస్ తో పాటు పక్కన కొందరు జవాన్లు విజయ్ ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో విజయ్ సినిమాలను వదిలి ఆర్మీలో చేరారా..? అనే చర్చ సాగుతోంది. అయితే ఆయన సినిమాలను వదిలి ఎక్కడికి పోలేదు. ఆర్మీ జవాన్లతో కలిసి ఫొటోలు దిగారంతే. ఇటీవల సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లినప్పుడు పక్కనే ఉన్న బేస్ క్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి కాసేపు గడిపారు. ఆ తరువాత చేతిలో గన్ పట్టుకొని వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
‘లైగర్’ తరువాత విజయ్ సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన కాశ్మీర్ వెళ్లారని కొందరు అంటున్నారు. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘జనగనమణ’ అనుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే అయన అక్కడికి వెళ్లారని అంటున్నారు. అయితే ‘లైగర్’ డిజాస్టర్ ను చూసిన తరువాత పూరి ‘జనగనమణ’ను పక్కనబెట్టారని అంటున్నారు. అదేం లేదు ఆ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. కానీ ఏ విషయంపై క్లారిటీ రావడం లేదు. విజయ్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప బయటపడదు.

ఇటీవల మాల్దీవులు వెళ్లినప్పుడు కూడా ఆయన ఎందుకు వెళ్లాడో చెప్పలేదు. ఓ యాడ్ షూటింగ్ కోసమని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం వీరి మధ్య ఏదో ఉందని.. కాలక్షేపం కోసం వెళ్లారని అంటున్నారు. ఏదీ ఏమైనా విజయ్ జవాన్లతో కలిసి ఫొటోలు దిగడం చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్లో షూటింగ్ కోసం ఎందరో వెళ్తారు. కానీ జవాన్లను కలిసిన హీరోలు కొందరు మాత్రమే. దీపావళి సందర్భంగా వారిని కలిసి ముచ్చటించడంతో వారు కూడా కాస్త హ్యపీగా ఫీలయ్యారు.