https://oktelugu.com/

క్రేజీ హీరో నిర్మాణంలో రేస్ క్లబ్ సిరీస్ !

టాలీవుడ్ లో ప్రస్తుతం అతి తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న క్రేజీ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది ఒక్క ‘విజయ్ దేవరకొండ’నే. తన యాక్టింగ్ కంటే కూడా తన ఆటిట్యూడ్ తోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న ఘనత, పవర్ స్టార్ తరువాత విజయ్ కే దక్కుతుంది. ఏమైనా విజయ్ దేవరకొండ.. నాని, రామ్ లాంటి హీరోలను దాటుకుని టాప్ స్టార్ రేంజ్ కి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అలాంటి ఈ సెన్సేషనల్ స్టార్ తమ్ముడిగా […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2020 / 07:18 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ప్రస్తుతం అతి తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న క్రేజీ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది ఒక్క ‘విజయ్ దేవరకొండ’నే. తన యాక్టింగ్ కంటే కూడా తన ఆటిట్యూడ్ తోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న ఘనత, పవర్ స్టార్ తరువాత విజయ్ కే దక్కుతుంది. ఏమైనా విజయ్ దేవరకొండ.. నాని, రామ్ లాంటి హీరోలను దాటుకుని టాప్ స్టార్ రేంజ్ కి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అలాంటి ఈ సెన్సేషనల్ స్టార్ తమ్ముడిగా ‘దొరసాని’ అనే స్లో అండ్ బోరింగ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’.

    Also Read: ప్లాప్ హీరోయిన్ కి భారీ ఆఫర్స్ !

    తన అన్నయ్యలాగే స్టార్ అవుతాడు అనుకుంటే కనీస స్థాయిలో కూడా హీరోగా మెప్పించలేక.. వెండితెర పై పూర్తిగా తేలిపోయాడు. అయితే ‘ఆనంద్ దేవరకొండ’కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా ‘ఆనంద్ దేవరకొండ’ను పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడట తరుణ్ భాస్కర్. ఈ వెబ్ సిరీస్ నేపథ్యం మొత్తం కొత్తగా ఉండబోతుందని.. ఆనంద్ దేవరకొండ పాత్ర మొత్తం హార్స్ రేసింగ్ నెపథ్యంలో సాగుతుందని.. అలాగే ఈ సిరీస్ చాలా వరకు రేస్ క్లబ్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

    Also Read: బాక్సర్ గా మారుతున్న ఈషా రెబ్బా.. పంచ్‌లు ఎవరిపైనో?

    ఇక తన తమ్ముడి కోసం ఈ సిరీస్ ను నిర్మించబోతున్నాడు విజయ్. ఇప్పటికే నిర్మాతగా విజయ్ దేవరకొండ ఒక సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఆనంద్ దేవరకొండ ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడట. తన పాత్రలో మంచి కామెడీని పండించే అవకాశం పుష్కలంగా ఉందని.. పైగా తరుణ్ భాస్కర్ హీరోల నుండి నటనను రాబట్టుకోవడంలో సిద్ధహస్తుడు. ఈ లెక్కన ఆనంద్ దేవరకొండకి వెబ్ సిరీస్ రూపంలో ఒక హిట్ రావడం దాదాపు ఖాయంలానే కనిపిస్తోంది.