కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

ఆడవాళ్లతో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విషయం కరోనాకు త్వరగానే అర్థమైనట్లుంది. దీంతో కరోనా తన ప్రభావన్ని మగవాళ్లపైనే ఎక్కువగా చూపిస్తోంది. ప్రస్తుత కాలంలో మహిళలు మగాళ్లతో సమానంగా అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్న సంగతి తెల్సిందే. ఇంట్లో.. బయట.. మగాళ్లపై పైచేయి సాధిస్తున్న ఆడవాళ్లు కరోనాను కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారని తాజా అధ్యాయనం వెల్లడైంది. Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..! శారీరకంగా మగవాళ్లు మహిళల కంటే బలవంతులుగా ఉంటారనేది […]

Written By: Neelambaram, Updated On : August 30, 2020 7:29 pm
Follow us on


ఆడవాళ్లతో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విషయం కరోనాకు త్వరగానే అర్థమైనట్లుంది. దీంతో కరోనా తన ప్రభావన్ని మగవాళ్లపైనే ఎక్కువగా చూపిస్తోంది. ప్రస్తుత కాలంలో మహిళలు మగాళ్లతో సమానంగా అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్న సంగతి తెల్సిందే. ఇంట్లో.. బయట.. మగాళ్లపై పైచేయి సాధిస్తున్న ఆడవాళ్లు కరోనాను కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారని తాజా అధ్యాయనం వెల్లడైంది.

Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

శారీరకంగా మగవాళ్లు మహిళల కంటే బలవంతులుగా ఉంటారనేది అందరికీ తెల్సిందే. అయితే కరోనా ఎదుర్కొనే విషయంలో మాత్రం పురుషులు మహిళల కంటే వెనుకంజలో ఉన్నట్లు అమెరికా యూనివర్సీటీ పరిశీలనలో వెల్లడైంది. దీంతోనే కరోనాతో మహిళల కంటే పురుషులే అధికంగా మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు వైరస్ సోకినప్పటికీ వారిలో కోవిడ్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి(ఇమ్యూన్‌ రెస్పాన్స్‌) అధికంగా ఉందని యేల్‌ యూనివర్సిటీ ఉమెన్స్‌ హెల్త్‌ రీసెర్చ్‌లో పేర్కొంది.

కరోనా పాజిటివ్ వచ్చిన మహిళల్లో పురుషుల కంటే టీ-సెల్‌ యాక్టివేషన్‌ చురుకుగా పనిచేస్తుందని వారి పరిశోధనలో వెల్లడైంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మలచుకోవడంలో టీ-లింపోసైట్స్‌గా పిలిచే ఈ సెల్స్‌ ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీరంలోకి సోకిన వైరస్‌ కణాలను ఇవి ప్రత్యక్షంగా చంపడంతోపాటు ఇతర రోగనిరోధక కణాలను యాక్టివేట్‌ చేస్తాయి. మగవారిలో టీ సెల్స్‌ నెమ్మదిగా ఉండటంతోనే కరోనాతో వారే అధికంగా మృతిచెందుతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది.

Also Read: ఏం చేయకపోయినా.. ఇది చేస్తే చాలు మోడీజీ?

ఈ నేపథ్యంలో కరోనా విషయంలో మహిళల కంటే పురుషులే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శారీరకంగా మగవాళ్లు మహిళల కంటే బలవంతులు అయినప్పటికీ కరోనాను ఎదుర్కొవడంలో మహిళలే బేష్ తేలడం గమనార్హం.