ప్రపంచాన్ని ఆవహించిన కరోనా వల్ల అందరి ఉద్యోగ, ఉపాధి దూరమైంది. వ్యాపారాలను చావుదెబ్బ తీసింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. అయితే ఇంత కరువులోనూ కొంతమంది అదృష్టవంతులైన వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. సాధారణ రోజుల్లో సంపాదించే దానికంటే ఎక్కువనే సంపాదించడం విశేషం.
Also Read: “ముందు ఇది కట్టండి.. మూడు రాజధానులు తర్వాత!” జగన్ పై ధ్వజమెత్తారు
అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ మాత్రం ఏకంగా సంపద పోగేసుకోవడం..ప్రపంచంలోనే ఎవ్వరికి అందనంత సంపదతో తొలిస్థానంలో నిలవడం విశేషంగా మారింది. కరోనా టైంలో అంతా ఆన్ లైన్లో కొనడంతో ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఆదాయం 2.85 శాతం పెరిగింది. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు.. సిఇఒ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మొదటి 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించారు. . ప్రస్తుతం బెజోస్ మొత్తం నికర విలువ 4204.6 బిలియన్లు.
ఈ కరోనా కాలంలో మందుల తయారీ కంపెనీలు, మెడికల్ షాపులు, మాస్క్ ల తయారీదారులు.. శానిటైజర్ తయారీదారులు, ఆస్పత్రులు, చిన్న కిరాణాషాపుల పంట పండింది. ఇప్పుడు వీరి వరుసలో మన టీడీపీ అదినేత చంద్రబాబును కూడా చేర్చాలి.
రిటైల్ విభాగంలో 124 హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లు, హెరిటేజ్ ఫుడ్స్ లను అప్పట్లో చంద్రబాబు ఫ్యూచర్ రిటైల్ గ్రూపుకు అమ్మేశాడు. చంద్రబాబు చేతిలో ఇప్పుడు ఆ హెరిటేజ్ -ఫ్యూచర్ గ్రూపులో రూ.295 కోట్ల విలువైన 3.65శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు. హెరిటేజ్ కొన్నప్పుడు ఫ్యూచర్ గ్రూపు విలువ కేవలం రూ.8083 కోట్లు.
కానీ ఇప్పుడు ఇదే ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ గ్రూపు ఏకంగా రూ.24713 కోట్లకు కొనుగోలు చేసింది. ఎలాగూ ఫ్యూచర్ గ్రూపులో చంద్రబాబు వాటా 3.65శాతం ఉంది. అంటే 24713 కోట్లలో 3.65శాతం అంటే రూ.907 కోట్లు. కాబట్టి చంద్రబాబు హెరిటేజ్ ను అమ్మిన 4 ఏళ్లలోనే ఏకంగా సంపాదించిన లాభం ఏకంగా 607 కోట్లు.
Also Read: బయటికొచ్చాడు కానీ బెంబేలెత్తిపోయాడు..? పాపం అచ్చెన్న
చంద్రబాబు రాజకీయాల్లో ఘోరంగా విఫలమైనప్పటికీ విజయవంతమైన వ్యాపారవేత్తగా మరోసారి నిరూపించుకొని సత్తా చాటాడని టీడీపీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి.
ఇంత అపరకుబేరుడైనా కూడా చంద్రబాబు మాత్రం అమరావతి రైతుల కోసం జోలుపట్టి అడుక్కోవడం బాగాలేదు అని అనుకుంటున్నారు. అమరావతి రైతుల కోసం తనకు వచ్చిన లాభాలైనా పంచితే తను అమరావతి విషయంలో చేసిన పాపం అయినా కడిగేసుకున్నట్టు అవుతుంది కదా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.