Vijay Devarakonda And Rashmika: సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగా విజయాలైతే దక్కడం లేదు. ఈ ఇయర్ ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు… ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన మధ్య చాలా మంచి కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అవుతుందనే చెప్పాలి… వీళ్ళిద్దరూ కలిసి చేసిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
Also Read: మిరాయి పవన్ కళ్యాణ్ రికార్డ్ ను బ్రేక్ చేసిందా..? బుడ్డోడా ఏంటీ షాక్ లు..
అయినప్పటికి వీళ్లిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో సైతం కొన్ని కథనాలైతే వెలబడుతున్నాయి. ఇక రీసెంట్గా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలైతే వచ్చాయి. నిజానికి రష్మిక మందాన ఈమధ్య సైమా అవార్డుల ఈవెంట్ కి హాజరయ్యారు.
అక్కడ తన చేతికి రింగు ఉండడంతో విజయ్ దేవరకొండ కి తనకి ఎంగేజ్మెంట్ అయిందంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద స్పందించిన రష్మిక మందాన అది తన చేతికి ఎప్పటినుంచో ఉంటున్న రింగ్ అని అది తన సెంటిమెంట్ రింగ్ అని ఎంగేజ్మెంట్ అయితే రహస్యంగా చేసుకోనని అందరికి చెప్పి తన అభిమానుల సమక్షంలోనే తన ఎంగేజ్మెంట్ చేసుకుంటానని చెప్పడంతో ఈ విషయానికైతే ఒక క్లారిటీ దొరికింది.
మొత్తానికైతే విజయ్ దేవరకొండ – రష్మిక మందాన ఇద్దరు కలిసి మరోసారి రాహుల్ సాంకృత్యాన దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిస్తే ఇద్దరికీ చాలా మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక ఇప్పటికే రష్మిక మందనా ఈ సంవత్సరం చావ, కుబేర లాంటి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించింది. ఇకమీదట కూడా రాబోయే సినిమాలతో గొప్ప విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…