Mirai Record: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొత్త కథలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తేజసజ్జ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుతం ఆయన మిరాయి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ నైతే సంపాదించుకుంది. ఇక నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజే ఈ సినిమా 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక దీంతో పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రికార్డు సైతం ఈ సినిమా బ్రేక్ చేయడం విశేషం… హరిహర వీరమల్లు సినిమాకి మొదటి రోజు 32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి.
ఇక దానిని బీట్ చేస్తూ మిరాయి సినిమా కలెక్షన్స్ అయితే వచ్చినట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రికార్డులను బ్రేక్ చేసే స్థాయికి ఎదిగాడు అంటే మామూలు విషయం కాదు.
ఇక ఫ్యూచర్లో సైతం తేజ సజ్జ మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తే మాత్రం ఆయన స్టార్ హీరోగా అవతరించడమే కాకుండా నెంబర్ వన్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే స్థాయికి ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటివరకు తేజ సజ్జ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చాలా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఆయన నుంచి ఒక సినిమా వస్తోంది అంటే చాలు ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది అనేలా ప్రేక్షకులలో ఒక కాన్ఫిడెంట్ అయితే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తన అభిమానుల సైతం ఆశిస్తున్నారు. సక్సెస్ ఫుల్ స్టోరీలను ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు సాగుతూ ఉండడం విశేషం…