Mokshagna Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా కోసం తన మెకోవర్ ను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్న బాలయ్య బాబు ఇప్పటివరకు ఆయన సినిమాను అయితే స్టార్ట్ చేయలేదు.
Also Read: మిరాయి పవన్ కళ్యాణ్ రికార్డ్ ను బ్రేక్ చేసిందా..? బుడ్డోడా ఏంటీ షాక్ లు..
ఇక ఎట్టకేలకు ఈ దసర రోజు మోక్షజ్ఞ సినిమాని పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయం మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది… ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.
సినిమా అనౌన్స్ అయ్యేదాకా ఏ న్యూస్ ని బయటకి చెప్పొద్దని నాగ్ అశ్విన్ చెప్పారట. ఇక దానికోసమే ఎవరు కూడా ఈ న్యూస్ కి సంబంధించిన ఏ ఒక్క లీక్ ని కూడా వదలడం లేదు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దసర కి ఈ సినిమాని స్టార్ట్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లి నెక్స్ట్ సమ్మర్ వరకు సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ నాగ్ అశ్విన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికి బాలయ్య కోసం మాత్రమే ఈ సినిమాని చేసి సక్సెస్ చేయాలని చూస్తున్నాడట. ఇక బాలయ్య బాబు కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారట. మొదటి నుంచి కూడా బాలయ్య బాబుకి అశ్విని దత్ కి మధ్య మంచి సంబంధాలు ఉండడంతో అశ్విని దత్ బ్యానర్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లోనే వర్కౌట్ అవుతుందా లేదా అనేది…