Gunasekhar Comments On Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి రాజమౌళికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాలన్నీ విజువల్ వండర్ గా తెరకెక్కుతుంటాయి. అయితే రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలో గొప్ప సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తో ఒక్కడు సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న గుణశేఖర్ భారీ సెట్లు వేసి సినిమాలను చేయడంలో దిట్ట…ఆయన గురించి చెప్పాలంటే ఆయన సినిమాల్లో పెద్దపెద్ద సెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి స్టార్ హీరోలకు సక్సెస్ ను అందించిన ఘనత కలిగిన దర్శకుడు… ప్రస్తుతం ‘యుఫోరియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఈగ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. మన కంటికి కనిపించని ఒక చిన్న ఈగ ను సీజీ లో క్రియేట్ చేసి ప్రేక్షకుడి ముందుకు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఆ థాట్ కే మనం సెల్యూట్ చేయాలి అంటూ ఆయన మాట్లాడాడు…
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినప్పటికి ఆయన కెరీర్లో ది బెస్ట్ సినిమా ఏది అంటే ఈగ సినిమా నే అని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు… ఎందుకంటే హీరోలతో ఎవరైనా సినిమాలు చేసి సక్సెస్ ను సాధిస్తారు. కానీ ఈగ తో చేయాలంటే దానికి చాలా ఘాట్స్ ఉండాలి అంటూ రాజమౌళి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు…
గుణశేఖర్ చేసిన రుద్రమదేవి సినిమా సైతం సిజి వర్క్ తో కూడుకొని ఉంటుంది. ఒక రకంగా ఈ సినిమాతో ఆయన ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు…ఇక తను ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లకు పోటీని ఇచ్చే స్థాయిలో లేకపోయిన ఆయనకున్న క్లారిటీ తో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…