https://oktelugu.com/

రెండో ‘బిచ్చగాడు’ వస్తున్నాడు..

విజయ్‌ ఆంటోనీ. మ్యూజిక్‌ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా మారిన తమిళ నటుడు. అంతేకాదు ప్రొడ్యూసర్, ఎడిటర్, సౌండ్‌ ఇంజినీర్, సింగర్, పాటల రచయిత గా మల్టీ టాలెంటెడ్‌ పర్సన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచతమే. విజయ్‌ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందింది. అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని సాధించింది. డబ్బింగ్‌ సినిమా అయినప్పటికీ దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగునాట బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 19, 2020 5:27 pm
    Follow us on

    Bichagadu 2

    విజయ్‌ ఆంటోనీ. మ్యూజిక్‌ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా మారిన తమిళ నటుడు. అంతేకాదు ప్రొడ్యూసర్, ఎడిటర్, సౌండ్‌ ఇంజినీర్, సింగర్, పాటల రచయిత గా మల్టీ టాలెంటెడ్‌ పర్సన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచతమే. విజయ్‌ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందింది. అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని సాధించింది. డబ్బింగ్‌ సినిమా అయినప్పటికీ దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగునాట బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఆంటోనీకి హీరోగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

    Also Read: వైజ‌యంతీ మూవీస్ త‌దుప‌రి చిత్రంలో ప్ర‌భాస్ జోడీ‌గా దీపికా !

    ఆ తర్వాత విజయ్‌ తమిళ్‌లో చేసిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అవుతున్నాయి. అంతకుముందే ‘నకిలీ’, ‘డాక్టర్‌ సలీమ్‌’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆంటోనీ ‘బిచ్చగాడు’ తర్వాత తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత ‘భేతాళుడు’, ‘యముడు’, ‘ఇంద్రసేన’, ‘రోషగాడు’, ‘కిల్లర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకు ముందుకొచ్చాడు. అయితే ఇవేవీ తెలుగులో బిచ్చగాడు అంత హిట్‌ కాలేదు.

    తెలుగుతో పాటు హిందీ, ఒడియా, మరాఠీ, కన్నడలో కూడా రీమేక్‌ అయిన బిచ్చగాడుకి తాజాగా సీక్వెల్‌ చేస్తున్నాడు విజయ్. ఈనెల 24న ఆంటోని పుట్టినరోజు . ఈ సందర్భంగా విజరు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీకి విజయ్‌ స్వయంగా కథ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్వాల సినిమా తెరకెక్కుతోంది. మరో నాలుగు సినిమాలు కూడా వివిధ దశలో ఉన్నాయి. అయితే కరోనా కారణంగా అన్ని షూటింగ్స్‌ ఆగిపోయాయి. కాగా, కరోనా కష్టకాలంలో నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తన రెమ్యునరేషన్‌లో 25 శాతం తగ్గించుకున్నాడు. దక్షిణాదిలో రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన తొలి హీరో విజయ్‌ ఆంటోనీనే కావడం విశేషం.
    Also Read: రజినీకాంత్ హీరోయిన్.. భారీ అందాలతో కనువిందు !