కరోనాతో సీనియర్ నటుడి మృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సాధారణ ప్రజలే కాదు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని కరనా కలవర పెడుతోంది. ప్రభుత్వం అనుమతించడంతో సినిమా, సీరియల్స్‌ షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తికి అవే హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటీనటులకు వైరస్‌ ప్రమాదం పొంచి ఉంది. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కుటుంబం సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. […]

Written By: Neelambaram, Updated On : July 19, 2020 4:45 pm
Follow us on


దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సాధారణ ప్రజలే కాదు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని కరనా కలవర పెడుతోంది. ప్రభుత్వం అనుమతించడంతో సినిమా, సీరియల్స్‌ షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తికి అవే హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటీనటులకు వైరస్‌ ప్రమాదం పొంచి ఉంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కుటుంబం సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కొందరు ఈ వైరస్‌ సోకి మృతి చెందారు.

తాజాగా..కన్నడ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు హ‌ల్వానా గంగాధ‌ర‌య్య(70) క‌న్నుమూశాడు. కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది కావ‌డంతో బెంగ‌ళూరులోని బీజీఎస్‌‌ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. హల్వానా కు భార్య ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు.

శాండిల్‌వుడ్‌లో గంగాధరయ్యకు మంచి పేరుంది. స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ప్రయాణం ప్రారంభించిన ఆయన గొప్ప న‌టుడిగాఎదిగాడు. క‌ర్నాట‌క నాట‌క అకాడ‌మీ అవార్డు గెలుచుకున్న ఆయన దాదాపు 120 సినిమాల్లో నటించాడు. మరో 1500కు పైగా స్టేజ్‌ షోల్లో కనిపించాడు. టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ‘నీర్ దోసె’, ‘కురిగాలు’, ‘శబద్రదేవి’ సినిమాలు ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. గంగాధరయ్య మృతి పట్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం ప్రకటించారు. తన నా స్నేహితుడి మ‌ర‌ణం తనను ఎంతగానో బాధిస్తోంద‌ని, ప్రముఖ దర్శక, ర‌చ‌యిత ఎన్ సీతారామ్ అన్నారు.