మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తొలుత ‘పిచ్చైకారన్’ పేరుతో తమిళ్‌లో రిలీజైన ఈ మూవీని తెలుగులో డబ్ చేయగా ఊహించని విజయం సాధించింది. హిందీ, ఒడియా, మరాఠీ, కన్నడలో కూడా రీమేక్ అయింది ఈ మూవీ. తెలుగు రైట్స్ కొన్న మేకర్స్‌కు కాసుల పంట పండించింది. 50 లక్షలతో కొన్న ఈ మూవీ టాలీవుడ్‌లో ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో పాటు ఆంటోనీకి తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తన మూవీస్‌ను విజయ్ నేరుగా తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు. టాలీవుడ్‌లో కూడా తనకు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘భేతాళుడు’, ‘యముడు’, ‘ఇంద్రసేన’, ‘రోషగాడు’, ‘కిల్లర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకు ముందుకొచ్చాడు. అయితే తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘బిచ్చగాడు’ను విజయ్ మరిచిపోవడం లేదు. దీనికి సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
Also Read: ట్రాక్ తప్పిన చైతు.. గైడ్ చేయనున్న నాగ్ !
శుక్రవారం ( జూలై 24) తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ ‘బిచ్చగాడు 2’ సినిమాను ప్రకటించాడు. అంతేకాదు మూవీ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశాడు. వైట్ కలర్ షర్ట్ దానిపై బ్లాక్ సూటు వేసుకున్న విజయ్ వెనక్కి తిరిగి ఉండగా… ముందు చాలా మంది ప్రజలు ఉన్న పోస్టర్ ఇట్రస్టింగ్‌గా ఉంది. ఫస్ట్ పార్టులో కోటీశ్వరుడైన హీరో అనారోగ్యంతో ఉన్న తల్లిని బ్రతికించుకోవడం కోసం 30 రోజులు బిచ్చగాడిగా మారే దీక్ష చేపడతాడు. క్లైమాక్స్‌లో హీరో బిచ్చగాడు కాదు కోటీశ్వరుడు అని అందరికీ తెలుస్తుంది. అక్కడి నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుందని ఫస్ట్ లుక్‌ను చూస్తే అర్థమవుతోంది. కాగా, బిచ్చగాడు 2కు విజయ్ ఆంటోనినే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కథ కూడా అతనే రాశాడు. ‘బారమ్’ అనే తమిళ్ ఫీచర్ సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. 2021లో రిలీజ్ కానుంది.
#pichaikkaran2 #Bitchagadu2 pic.twitter.com/hsaEdEURMO
— vijayantony (@vijayantony) July 24, 2020