https://oktelugu.com/

మాస్కు పెట్టుకోలేదా.. లక్ష కట్టాల్సిందే..!

క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మనమంతా పుస్తకాల్లో చదువుకున్నాం.. కానీ ప్రస్తుతం కరోనాకు పూర్వం.. కరోనా శకం అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదంతా డ్రాగన్ కంట్రీ పుణ్యమేనని చెప్పొచ్చు. ప్రపంచానికి చైనా వస్తువులను ఎంత చౌకగా అందిస్తుందో.. అలాగే వైరసులకు కూడా ప్రపంచానికి బహుమతిగా ఇస్తోంది. గతంలోనూ ఎన్నో మహమ్మరి రోగాలకు చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెల్సందే. తాజాగా కరోనా మహమ్మరిని ప్రపంచంపైకి చైనా వదిలింది. ఆదేశంలో కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 02:26 PM IST
    Follow us on


    క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మనమంతా పుస్తకాల్లో చదువుకున్నాం.. కానీ ప్రస్తుతం కరోనాకు పూర్వం.. కరోనా శకం అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదంతా డ్రాగన్ కంట్రీ పుణ్యమేనని చెప్పొచ్చు. ప్రపంచానికి చైనా వస్తువులను ఎంత చౌకగా అందిస్తుందో.. అలాగే వైరసులకు కూడా ప్రపంచానికి బహుమతిగా ఇస్తోంది. గతంలోనూ ఎన్నో మహమ్మరి రోగాలకు చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెల్సందే. తాజాగా కరోనా మహమ్మరిని ప్రపంచంపైకి చైనా వదిలింది. ఆదేశంలో కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి.

    Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

    అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి ఏం చేయాలో తెలియక చేతులేత్తేస్తున్నాయి. ఇటలీ లాంటి అందమైన దేశం కరోనా ఎంట్రీతో శవాలదిబ్బగా మారింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వైరస్ అందరిపై ప్రభావం చూపుతోంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆందోళన రేపుతోంది. లాక్డౌన్ విధించినప్పుడు కరోనా కట్టడిలోనే ఉంది. అయితే కేంద్రం ఎప్పుడైతే ఆన్ లాక్ విధించిందో నాటి నుంచి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇతర దేశాలతో పొలిస్తే మనదేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉండటం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కొంత ఊపశమనం కలిగిస్తుంది.

    కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం వంటివి చేస్తున్నాయి. అయితే కొంతమంది తమకేమీ కాదనే ధోరణిలో కరోనా నిబంధనలు పాటించకుండా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే జరిమానాలు, కేసులు పెడుతూ వారిని కట్టడి చేస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లోనూ మాస్కులు ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయాల వరకు జరిమానా విధిస్తున్నారు. దీంతో ప్రతీఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తున్నారు. తాజాగా జార్జండ్ ప్రభుత్వం కరోనా కట్టడికి సంచలనం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాస్కు ధరించకపోతే ఏకంగా లక్ష రూపాయాల జరిమానా విధించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కరోనా నిబంధనలు పాటించకపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించేలా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నారు.

    Also Read: కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా?

    ప్రభుత్వం ముందుగా ప్రజలందరికీ మాస్కులు సరఫరాచేసి ఆతర్వాత వారు పాటించకపోతే జరిమానా విధించాలని పలువురు కోరుతున్నారు. అసలే లాక్డౌన్ కారణంగా పనుల్లేక ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వాలు మాత్రం లక్షల్లో జరిమానాలు, జైలు శిక్షలు విధించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కరోనా కట్టడి చేయాలని ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.