https://oktelugu.com/

కరోనా దెబ్బకు అవతార్2 ఏడాది ఆలస్యం

అవతార్. ప్రపంచం సినీ చరిత్రలో ఓ అద్భుతం. హాలీవుడ్‌ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ క్రియేట్‌ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ వండర్. తెరపై పండోరా గ్రహాన్ని సృష్టించిన కామెరూన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. 2009లో వచ్చిన ఈ హాలీవుడ్‌ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 237 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా 2.79 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది. ఈ మూవీకి ఏకంగా నాలుగు సీక్వెల్స్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 05:09 PM IST
    Follow us on


    అవతార్. ప్రపంచం సినీ చరిత్రలో ఓ అద్భుతం. హాలీవుడ్‌ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ క్రియేట్‌ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ వండర్. తెరపై పండోరా గ్రహాన్ని సృష్టించిన కామెరూన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. 2009లో వచ్చిన ఈ హాలీవుడ్‌ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 237 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా 2.79 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది. ఈ మూవీకి ఏకంగా నాలుగు సీక్వెల్స్‌ తీస్తున్నట్టు కామెరూన్‌ ప్రకటించాడు. రెండు, మూడో పార్ట్‌కు సంబంధించి ప్రాధమిక షూటింగ్‌ కూడా ముగిసింది. వచ్చే ఏడాది డిసెంబర్ 17న అవతార్2ను రిలీజ్‌ చేస్తామని కామెరూన్‌ గతంలోనే చెప్పాడు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌, ఇతర పనులు జరుపుకునే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా విడుదలను ఓ ఏడాది వాయిదా వేశారు.

    Also Read: సూటు..బూటులో వస్తున్న బిచ్చగాడు 2

    దాంతో అవతార్ సెకండ్‌ పార్ట్‌ ఏడాది ఆలస్యంగా 2022 డిసెంబర్16న విడుదల కానుంది. ఈ మేరకు దర్శకుడు కామెరూన్ ఓ లేఖను విడుదల చేశాడు. న్యూజిలాండ్‌లో ప్లాన్‌ చేసిన లైవ్‌ యాక్షన్‌ ఫిల్మింగ్‌ ఇంకా మొదలు కాలేదని చెప్పాడు. అలాగే, ఈ మూవీకి కీలకమైన వర్చువల్ వర్క్ లాస్ ఏంజెలెస్‌లో స్టూడియోల్లో చేయాల్సి ఉండగా.. కరోనా కారణంగా దానికి అంతరాయం ఏర్పడిందని చెప్పాడు. దీంతో అవతార్ సీక్వెల్‌ను వాయిదా వేయక తప్పడం లేదని, దీనివల్ల తనకంటే ఎక్కువగా బాధపడేవారు ఎవరూ లేరని అన్నాడు. కాగా, కరోనా ప్రభావం ఒక్క అవతార్2పైనే పడలేదు. మిగతా మూడు పార్టులు కూడా ఆలస్యం కానున్నాయి. రెండో పార్ట్‌ 2021 నుంచి 2022కి వెళ్లడంతో అవతార్3ను 2024 డిసెంబర్ 20న, నాలుగో పార్ట్‌ను 2026 డిసెంబర్ 18న, ఐదో పార్ట్‌ను 2028 డిసెంబర్ 22న రిలీజ్‌ చేయాలని రీషెడ్యూల్‌ చేసింది చిత్ర బృందం. కాగా, ఈ సీక్వెల్స్‌ను డిస్నీ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.