Homeఎంటర్టైన్మెంట్Actress Pragathi: మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన... నటి ప్రగతి

Actress Pragathi: మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన… నటి ప్రగతి

Actress Pragathi: వెండితెరపై త‌ల్లి, అత్త క్యారెక్ట‌ర్ లు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి ప్ర‌గ‌తి. ఎఫ్ 2, బాద్ షా సినిమాల‌తో ప్ర‌గ‌తి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్నారు నటి ప్రగతి. 44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తున్నట్లుంటుంది ప్రగతి.

artist pragathi super dance for megastar block buster song in awards function

ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రగతి పోస్ట్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ స్పాట్ పిక్స్‌తో పాటు, ఆమె షేర్ చేసే జిమ్ వీడియోలు చూస్తే షాకవ్వాల్సిందే. ఇటీవల ఆమె వేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు మరో వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ప్రగతి. ఇటీవల జరిగిన సంతోషం సుమన్ టీవీ అవార్డ్స్ ఫంక్షన్‌లో ‘ఆట’ సందీప్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది ప్రగతి.

ఈ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘అల్లుడా మజాకా’ లోని ‘అత్తో అత్తమ్మ కూతురో’ పాటకి స్టెప్పులు ఇరగదీసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌గ‌తి ప్ర‌స్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్ 2 కు సీక్వెల్ గా వ‌స్తోన్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ప‌లు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది ప్రగతి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version