Victory Venkatesh : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. టాలీవుడ్ పై దశాబ్దాలుగా ఆధిపత్యం ప్రదరిస్తున్నారు. భారీ ఫ్యాన్ బేస్ తో స్టార్డం అనుభవిస్తున్నారు. చిరంజీవి మాత్రమే భారీ హిట్స్ కొడుతుండగా.. అఖండ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన బాలకృష్ణ వరుస హిట్స్ ఇస్తున్నాడు. ఆయన సినిమాలు ఈజీగా వంద కోట్ల వసూళ్లు దాటేస్తున్నాయి. నాగార్జున స్ట్రగుల్ అవుతున్నారు. వెంకటేష్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఇండస్ట్రీ హిట్ కొట్టి రేసులో దూసుకొచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ మూవీ గత వైభవాన్ని గుర్తు చేస్తూ 92 సెంటర్స్ లో 50 రోజులు ఆడటం ఊహించని పరిణామం. సెంటర్స్ లో 50, 100 రోజులు ఆడే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. కాగా సీనియర్స్ లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా వెంకీ రికార్డులకు ఎక్కాడు. చిరు, బాలయ్య సైతం ఈ ఫీట్ అందుకోలేదు. సోలో హీరోగా వెంకటేష్ హిట్ కొట్టడం కష్టమే అనుకుంటున్న తరుణంలో అతిపెద్ద విజయం అందించాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మించాడు. 2025 సంక్రాంతి విన్నర్ గా ఈ చిత్రం నిలిచింది.
Also Read : చిక్కుల్లో పడ్డ విక్టరీ వెంకటేష్..’సంక్రాంతికి వస్తున్నాం’ ఎఫెక్ట్..ఎటూ తేల్చుకోలేకపోతున్నాడుగా!
కాగా నెక్స్ట్ వెంకటేష్ మూవీ ఏమిటనే చర్చ జరుగుతుండగా.. దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్నాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. సురేందర్ రెడ్డి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. అతనొక్కడే, కిక్, రేసు గుర్రం, ధ్రువ, సైరా నరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి గత చిత్రం ఏజెంట్ డిజాస్టర్ కావడంతో ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడింది. ఏజెంట్ విడుదలై రెండేళ్లు అవుతున్నా మూవీ సెట్ కాలేదు. వెంకటేష్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఓకే అయ్యిందనేది తాజా న్యూస్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
వెంకటేష్ కి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే వర్క్ అవుట్ అవుతున్నాయి. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అద్భుతమైన కామెడీ, కమర్షియల్ అంశాలతో చిత్రాలు చేయడంలో సురేందర్ రెడ్డి దిట్ట. ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అయితే వెంకటేష్ కి మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే ఉహాగానాలు మొదలయ్యాయి.
Also Read : ఒడిశాలో మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్..అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ అతి త్వరలో!