https://oktelugu.com/

HBD Venky: విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేశ్ పుట్టినరోజు నేడు.. ఆయన సినీ ప్రస్థానంలో అపూర్వ ఘట్టాలివీ

HBD Venky: థియేటర్​లో ఓ వైపు నవ్వులు పూయిస్తూనే.. మరోవైపుసెంటిమెంట్​ ఎమోషన్స్​ను పండించగల ఏకైకన హీరో విక్టరీ వెంకటేశ్​. సినీ నేపథ్యం కుటుంబానికి చెందినవాడైనప్పటికీ.. సొంత కాళ్లపై నిలబడి తన టాలెంట్​తో టాప్​హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి వెంకి. ఆయన అభిమానులు అందరూ ఆయన్ను ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో 80 సినిమాలకు పైగా నటించి.. సూపర్ సక్సస్ రేట్​తో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పటి స్టార్​ కుర్ర హీరోలకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 01:23 PM IST
    Follow us on

    HBD Venky: థియేటర్​లో ఓ వైపు నవ్వులు పూయిస్తూనే.. మరోవైపుసెంటిమెంట్​ ఎమోషన్స్​ను పండించగల ఏకైకన హీరో విక్టరీ వెంకటేశ్​. సినీ నేపథ్యం కుటుంబానికి చెందినవాడైనప్పటికీ.. సొంత కాళ్లపై నిలబడి తన టాలెంట్​తో టాప్​హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి వెంకి. ఆయన అభిమానులు అందరూ ఆయన్ను ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో 80 సినిమాలకు పైగా నటించి.. సూపర్ సక్సస్ రేట్​తో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పటి స్టార్​ కుర్ర హీరోలకు కూడా కంటెంట్​ ఉన్న చిత్రాలు చేస్తూ.. గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్​ నిర్మాత రామానాయడు తనయుడిగా సినిమాలో తొలి అడుగులు వేసి.. తనదైన ప్రతిభతో మాస్​, క్లాస్​, ఫ్యామిలి ఇలా అన్ని జోనర్లను టచ్​ చేసి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు వెంకి.  ఈ రోజు వెంకీ మామ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​పై ఓ లుక్కేద్దాం.

    1986 ఆగష్టు 14న కలియుగ పాండవులు సినిమాతో హీరోగా తెరపై మెరిసి.. తొలి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును దక్కించుకున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో 7 నంది అవార్డులతో పాటు 6 ఫిల్మ్​ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. అంతకమంటే ముందే ప్రేమ్​నగర్​లో బాలనటుడిగా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం,  బొబ్బిలి రాజా, ప్రేమ, చంటి, సుందరకాండ, ధర్మచక్రం, ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, గణేశ్​, వసంతం, సంక్రాంతి, మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్​, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి రీసెంట్​గా వచ్చిన నారప్ప, దృశ్యం2 వరకు అన్నీ సినిమాల్లోను విభిన్న పాత్రలు, కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించడంలో వెంకి మామ ముందుంటారు.

     

    కాగా, ఇటీవలే దృశ్యం సీక్వెల్​గా తెరకెక్కిన దృశ్యం2 సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎఫ్​3లో నటిస్తున్నారు వెంకి. అనిల్​ రావిపుడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో వరుణ్​ తేజ్​తో పాటు తమన్న, మెహరిన్ కూడా నటిస్తున్నారు. సునీల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.