https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ అతిధి మర్యాదకు ఫిదా అయిన మరో బాలీవుడ్ బ్యూటీ… సోషల్ మీడియాలో పోస్ట్

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సాధించిన ఘన విజయంతో దేశ, విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు మన డార్లింగ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజ హెగ్దే తో కలిసి నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మరోవైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 01:30 PM IST
    Follow us on

    Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సాధించిన ఘన విజయంతో దేశ, విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు మన డార్లింగ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజ హెగ్దే తో కలిసి నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మరోవైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ షూటింగ్ నిమిత్తం బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే హైదరాబాద్ వచ్చింది.

    ఇక తన సినిమాలోని హీరోయిన్స్ కి ఆర్టిస్టులకు ప్రభాస్ చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. ప్రభాస్‌ తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తే సెట్ లో అందరికి పండుగే. వెరైటీ వంట‌లతో తన కో ఆర్టిస్టులకు అతిధి మర్యాదలు బాగానే చేస్తాడు ప్రభాస్. ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతీసారి ఆ వంటలని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. గతంలో ‘సాహో’ సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, ‘సలార్’ చిత్రీకరణ షూటింగ్ లో శృతిహాసన్ కి, ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్ళు ఫిదా అయిపోయారు. తాజాగా ఎప్పటిలాగే దీపికాకి కూడా స్పెషల్ ఫుడ్ తెప్పించాడట ప్రభాస్. దీపికా పదుకొణెకి కూడా త‌న ఇంటి నుంచి రకరకాల వంటలు తెప్పించి స్వయంగా వడ్డించాడట ప్రభాస్. ప్రభాస్ తెప్పించిన వంటలు, చేసిన అతిథి మ‌ర్యాద‌ల‌తో దీపిక షాక్ అయ్యింది. ఆ వంటలని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ ని, సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేసింది దీపికా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.