Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: ప్రొ కబడ్డీ లో "తెలుగు టైటాన్స్" కి సపోర్ట్ గా నాగ చైతన్య......

Naga Chaitanya: ప్రొ కబడ్డీ లో “తెలుగు టైటాన్స్” కి సపోర్ట్ గా నాగ చైతన్య… జెర్సీ మాత్రమే కాదు అంటూ ట్వీట్

Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇటీవల సాయి పల్లవితో జతగా నటించిన ” లవ్ స్టోరీ ” సినిమా ఘన విజయం దక్కించుకుంది. మరో వైపు తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు. కాగా ఈ తరుణంలో డిసెంబర్ 22వ తేదీ నుంచి జరగనున్న ప్రో కబడ్డీ హంగామా అప్పుడే మొదలైపోయింది. టీమ్స్‌ను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. మన తెలుగు జట్టు అయిన తెలుగు టైటాన్స్‌ను యువసామ్రాట్ నాగచైతన్య సపోర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా నాగ చైతన్య వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోని చైతూ ట్విట్టర్ వేదికగా అబిమానులతో పంచుకున్నారు.

akkineni naga chaitanya supporting telugu titans team in pro kabaddi league

అలానే ఈ ట్వీట్‌లో ‘జెర్సీ మాత్రమే కాదు కవచమది… గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది… ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో తెలుగు టైటాన్స్ సత్తా చాటడానికి సిద్ధమంటుంది. రా చూద్దాం వివో ప్రొ కబడ్డీ డిసెంబర్ 22 నుంచి మీ స్టార్ స్పొర్ట్స్ తెలుగులో అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరోవైపు నాగచైతన్య విక్రమ్ కుమార్‌తో ‘థ్యాంక్యూ’, కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చిత్రాల్లో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా బంగార్రాజు సినిమాతో తండ్రితో కలిసి సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్నాడు చైతూ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version