https://oktelugu.com/

Sri Lanka Vs New Zealand: స్వదేశంలో.. లంకేయుల తడ”బ్యాటు”.. అద్భుతం జరిగితేనే న్యూజిలాండ్ పై పైచేయి..

ఇంగ్లాండ్ జట్టుతో వారి సొంత దేశంలో ఇటీవల శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడింది. 2-1 తేడాతో లంక జట్టు సిరీస్ ఇంగ్లాండ్ కు అప్పజెప్పింది. మొదటి రెండు టెస్టులు ఓడిపోయినప్పటికీ.. చివరి టెస్ట్ లో మాత్రం అద్భుతంగా ఆడింది. స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అయితే స్వదేశంలో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తడబడుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 18, 2024 / 03:14 PM IST

    Sri Lanka Vs New Zealand

    Follow us on

    Sri Lanka Vs New Zealand: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు రెండు టెస్టులు ఆడుతున్నాయి. తొలి టెస్ట్ శ్రీలంకలోని గాలే మైదానం వేదికగా ప్రారంభమైంది.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు పై మూడవ టెస్టులో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసి ఆకట్టుకున్న ఓపెనర్ నిస్సాంక.. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో తేలిపోయాడు. కేవలం 27 పరుగులు మాత్రమే చేసి విలియం ఓరెర్కే బౌలింగ్ లో ఆటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ దిముత్ కరుణ రత్నే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి విలియం ఓరెర్కే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న అతడు టామ్ బ్లండెల్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. 20 పరుల వద్ద కరుణ రత్నే తొలి వికెట్ గా అవుట్ కావడంతో వన్ డౌన్ బ్యాటర్ గా దినేష్ చండి మాల్ క్రీజ్ లోకి వచ్చాడు. 71 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్ల సహాయంతో 30 పరుగులు చేశాడు. సౌకర్యవంతంగా కనిపిస్తున్న అతడు సౌథి బౌలింగ్లో బ్రెస్ వెల్ పట్టిన క్యాచ్ ద్వారా పెవిలియం చేరుకున్నాడు. ఇక మరో ఆటగాడు, శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా 11 పరుగులు మాత్రమే చేసి గ్లెన్ పిలిప్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డీ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు 106 పరులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.

    న్యూజిలాండ్ జట్టులో..

    న్యూజిలాండ్ జట్టులో విలియం ఓరెర్కే రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఫిలిప్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కెప్టెన్ సౌథి ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ టోర్నీ జరుగుతోంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. ఇటీవల ఇంగ్లాండు పై ఒక టెస్ట్ గెలవడంతో శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే పకడ్బందీ ప్రణాళికతో శ్రీలంక లో అడుగుపెట్టింది. అందుకు తగ్గట్టుగానే మెరుగైన బౌలర్లతో బౌలింగ్ చేయిస్తోంది. తదుపరి సమాచారం అందే వరకు శ్రీలంక 41.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది. క్రీజ్ లో కమిందు మెండిస్ 33, ఏంజెలో మాథ్యూస్ 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య రెండవ టెస్ట్ గాలే మైదానం వేదికగా సెప్టెంబర్ 26 నుంచి మొదలుకానుంది.