Prabhas- Venu Swamy: ప్రభాస్ టైం నిజంగా బాగోలేదు. బాహుబలి తర్వాత ఆయన నటించిన మూడు చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్స్ అయ్యాయి. సాహో కనీసం హిందీలో విజయం సాధించింది. రాధే శ్యామ్ దారుణ పరాజయం చవిచూసింది. లేటెస్ట్ రిలీజ్ ఆదిపురుష్ సైతం హిట్ టాక్ తెచ్చుకోలేదు. అనేక వివాదాలతో పాటు సినిమా ఏమంత గొప్పగా లేదన్న మాట వినిపిస్తోంది. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక దర్శకుడు ఓం రౌత్ క్రియేటివిటీ వివాదాస్పదం అవుతుంది.
రామాయణ పాత్రలను ఆయన తీర్చిద్దిన తీరు, రాసుకున్న సన్నివేశాలను హిందూ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఆదిపురుష్ కూడా ప్లాప్ ఖాతాలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసిన స్థాయిలో వసూళ్లు దక్కేటట్లు లేవు. అయితే ఇదంతా ప్రభాస్ జాతక ఫలితమే అంటున్నారు వేణు స్వామి. ప్రభాస్ జాతకం కారణంగానే ప్రభాస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయట.
తులా రాశి కలిగిన ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత క్రిందకు పడిపోతాడు. అతడి భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ప్లాప్ అవుతాయి. ప్రభాస్ తో చిత్రాలు చేసే దర్శక నిర్మాట్లకు జాతకాలు చూపించుకుంటే మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ప్రభాస్ కి విజయం దక్కాలంటే అతడు చిన్న చిత్రాలు చేసుకోవాలి. అదొక్కక్కటే మార్టం. ప్రభాస్ చేసే పాన్ ఇండియా చిత్రాలు ఆడవు, అని ఆయన బల్లగుద్ది చెప్పారు.
మరి వేణు స్వామి జాతకం నిజమైతే సలార్, ప్రాజెక్ట్ కే కూడా ఆడవు. ఈ రెండు చిత్రాల బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుంది. అలాగే దర్శకుడు మారుతితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ప్రాజెక్ట్ కే, సలార్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ బడ్జెట్ మూవీ. ప్రభాస్ నటించాడు కాబట్టి పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. అనంతరం సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. అది కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది