Pawan Kalyan Look : నాయకుడంటే కోటలో రాజులా కాదు.. పదిమందిలో ఒకడిగా ఉండాలి. అందరితోపాటు కూర్చోవాలి.. కలిసిపోవాలి.. వారందరూ చెప్పే బాధలు వినాలి.. నేనున్నానని నడిపించాలి. సాదాసీదాగా ఉంటూనే స్ఫూర్తినింపాలి. అప్పుడే నాయకుడి వెంట జనం నడుస్తారు.. జనసైన్యం కదిలివస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో కలిసిపోతున్నారు. నిన్న పిఠాపురం సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటికి పవన్ కళ్యాణ్ వచ్చిన తీరు లుక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నేతగా కాకుండా ఒక స్టైలిష్ సీఎంగా టక్, బెల్ట్ , ఫార్మార్ డ్రెస్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇన్నాళ్లు నేతలు అంటూ ఖద్దరు చొక్కా.. లాల్చీలు వేసుకొని కనిపించేవారు. పొలిటికల్ లీడర్లు అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా భావించేవారు. కానీ అక్కడ మోడీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వన్నె తెచ్చి కొత్త ఒరవడిని సృష్టించగా.. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ ఫార్మాల్ షర్ట్ పాయింట్ వేసుకొని ఒక ఉన్నతాధికారిగా.. స్టైలిష్ సీఎంగా కనిపించి అలరించారు. పవన్ కళ్యాణ్ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ ‘సీఎం’గా చూడాలనుకునే వారందరి కడుపు నిండేలా ఈ లుక్ ఉంది. నిజంగా సూపర్బ్ స్టైలిష్ సీఎంగా పవన్ ఉన్నాడని.. అచ్చం అలాగే నేతలతో కలిసి మీటింగ్ లో కనిపించాడని ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..

