Venu Swamy: వేణు స్వామి తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. సినీ తారలు, రాజకీయ నాయకుల జాతకాలు ఇంటర్వ్యూల్లో చెబుతూ పాప్యులర్ అవుతున్నాడు. జాతకం పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వేణు స్వామి చేసే కామెంట్స్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అందుకే వేణు స్వామిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ వేణు స్వామి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.
తాజాగా మరోసారి ప్రభాస్ ని టార్గెట్ చేశాడు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి గురించి సంచలన వ్యాఖలు చేశాడు. ఉగాది పండుగ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి శ్యామల దేవి, ప్రభాస్ లకు అసలు సంబంధమే లేదని అన్నారు. వేణు స్వామి మాట్లాడుతూ .. వాళ్లిద్దరూ బంధువులు అని చాలా మంది అనుకుంటారు. అసలు ప్రభాస్-శ్యామల దేవి కి మధ్య సంబంధమే లేదు. అసలు నిజాలు నాకు మాత్రమే తెలుసు అని అన్నారు. శ్యామల దేవి ప్రభాస్ కి బంధువే కాదు, అన్నారు.
కానీ నా వరకు నేను శ్యామల దేవి కంటే ప్రభాస్ తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నేను వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పాలి అనుకోవడం లేదు. ఒక సందర్భంలో ప్రభాస్ జాతకం వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పను. ప్రభాస్ జాతకం చూశాను. అప్పుడే అతని గురించి అవగాహన చేసుకున్నాను అని వేణు స్వామి వెల్లడించారు.
కాగా ఒకసారి శ్యామల దేవి గారు కూడా నా దగ్గరకు వచ్చారని వేణు స్వామి అన్నారు. కానీ ఆమె ప్రభాస్ గురించి ఆగలేదట. కృష్ణం రాజు గారు బతికి ఉన్నప్పుడు ఆయన గవర్నర్ అయ్యే అవకాశం ఉందా? అని అడిగారని .. ఇప్పుడు నేనెవరో తెలియనట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఈ విషయాలు పక్కన పెడితే ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడీ, రాజా సాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.