Venu Swamy: మంత్రులు ఓడిపోతే.. జగన్ ఎలా గెలుస్తాడు వేణు స్వామి

వేణు స్వామి ఏపీ రాజకీయాల్లో సైతం జోష్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని తేల్చి చెప్పారు. 2029 లో కూడా ఆయనేనని స్పష్టం చేశారు.

Written By: Dharma, Updated On : April 10, 2024 2:29 pm

Venu Swamy

Follow us on

Venu Swamy: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో తెలియదు కానీ.. వేణు స్వామి జాతకం మాత్రం జరిగి తీరుతుంది అన్నది చాలామంది అభిప్రాయం. ఆ మధ్యన సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే వారిద్దరూ నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి వేణు స్వామి ఫేమస్ అయ్యారు. ఆన్లైన్లో జాతకాలు చెబుతూ, ఎన్నికల జోష్యాలు చెప్పుకొస్తూ పెద్ద సెలబ్రిటీ అయ్యారు. అయితే ఆయన చెబుతూ వచ్చిన జోష్యం తెలంగాణ ఎన్నికల్లో తప్పింది. కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. యువరాజుగా కేటీఆర్ కు కిరీటం పెట్టడం తధ్యమని.. రేవంత్ కు అసలు సీఎం అయ్యే యోగ్యత లేదని.. గ్రహాలు అలా చెబుతున్నాయంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. కానీ ఫలితాల్లో సీన్ మారింది. ఈ సెలబ్రిటీ కాస్త సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. నెటిజెన్లు ఓ రేంజ్ లో వేసుకున్నారు.

అయితే వేణు స్వామి ఏపీ రాజకీయాల్లో సైతం జోష్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని తేల్చి చెప్పారు. 2029 లో కూడా ఆయనేనని స్పష్టం చేశారు. అయితే తాజాగా వేణు స్వామి మరోసారి తెరపైకి వచ్చారు. జగన్ గ్రహస్థితి బాగుందని.. ఆయన మరోసారి సీఎం కావడం ఖాయమని తేల్చేశారు. కానీ వైసీపీ కీలక నేతలు విషయంలో మాత్రం డిఫెన్స్ లో పెట్టారు. వారికి కష్టమన్న సంకేతాలు ఇచ్చారు. వారు గట్టి ఫైట్ ఎదుర్కొంటున్నారని చెప్పడం ద్వారా ఏవేవో అనుమానాలకు కారణమయ్యారు.

మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ల జోష్యాన్ని చెప్పే క్రమంలో ఆసక్తికర విషయాలను వేణు స్వామి వెల్లడించారు. వీరు కష్టపడాల్సి ఉంటుందని మాత్రం చెప్పారు. టఫ్ ఫైట్ అని చెప్పడం ద్వారా అసలు రహస్యాన్ని బయటపెట్టేశారు. అటు నెల్లూరు పార్లమెంట్ స్థానంపై కూడా మాట్లాడారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టిడిపి నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డికి పది శాతం అడ్వాంటేజ్ కనిపిస్తుందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే కీలక నేతలందరూ డేంజర్ పొజిషన్లో ఉండగా.. జగన్ మాత్రం 2024, 2029లో గెలుస్తారని వేణు స్వామి నమ్మకంగా చెబుతుండడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. అయితే వేణు స్వామి జోష్యం ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.