HBD Venky: తెలుగు సినీ పరిశ్రమలో సొంత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్. ఆయనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రత్యేక ఇమేజ్ ఉంది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగులేసి.. తన ప్రతిభతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు 35 ఏళ్ల కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించి.. ఇప్పటికీ విభిన్న పాత్రలు, కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

ఇదే క్రమంలోనే చాలా మంది హీరోలు తమ ఫ్యామిలీ పర్సన్స్‌ను బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయరు. ఈ కోణానికి చెందిన వ్యక్తే వెంకి మామ కూడా. ఆయన పిల్లలు, భార్య నీరజా గురించి ఎక్కడా ఒక్కసారి కూడా ప్రస్థావించిన సందర్భం లేదు. వాళ్లతో కలిసి పెద్దగా బయట కనిపించిన కోణాలు లేవు.
కానీ, ఇప్పటి వరకు వెంకీ విక్టరి వెనక ఉంది మాత్రం ఆయన భార్య నీరజా రెడ్డి అని వెంకి సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. వీరిద్దరిద కులాంతర వివాహం. అప్పట్లోనే కులాలకు అతీతంగా ఆలోచించిన దృక్పతం వెంకీది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన నీరజా రెడ్డి ఫ్యామిలీ రాజకీయంగా బలంగా ఉండేవారు. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు మాట్లాడుకుని వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. వారిని తనే చూసుకుంటుంది. వెంకీ మామకు సినిమా షూటింగ్ బిజీ ఉండగా.. తనే ఇంటి బాధ్యతలను తీసుకుంటుంది. అంతే కాదు వారి చదువులోనూ తనే కీలక పాత్ర పోషిస్తుందట.
ఇక వెంకీ మామ విషయానికొస్తే ఇటీవలే దృశ్యం 2తో హిట్ కొట్టిన ఆయన.. త్వరలో ఎఫ్3 సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపుడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటించారు.