https://oktelugu.com/

Dil Raju: సింగర్ అవతారం ఎత్తిన నిర్మాత దిల్ రాజు… వైరల్ గా మారిన వీడియో

Dil Raju: ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా అందరూ మారుతూ వస్తున్నారు. మెల్లమెల్లగా అన్నీ మారుతున్నాయి. గతంలో సినిమాల్లో, ఈవెంట్స్ లో పాటలు పాడటానికి కేవలం సింగర్స్ మాత్రమే ఉండే వాళ్ళు. అయితే ఇప్పుడు అందరూ సింగర్స్ గా మారుతూ పాటలు పాడేస్తున్నారు. మన స్టార్ హీరోలంతా సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళే. ఇక కొంతమంది ఈవెంట్స్ లో స్టేజిపై తమ గొంతుని విప్పుతారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా సింగర్ లా మారారు. నిన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 01:46 PM IST
    Follow us on

    Dil Raju: ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా అందరూ మారుతూ వస్తున్నారు. మెల్లమెల్లగా అన్నీ మారుతున్నాయి. గతంలో సినిమాల్లో, ఈవెంట్స్ లో పాటలు పాడటానికి కేవలం సింగర్స్ మాత్రమే ఉండే వాళ్ళు. అయితే ఇప్పుడు అందరూ సింగర్స్ గా మారుతూ పాటలు పాడేస్తున్నారు. మన స్టార్ హీరోలంతా సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళే. ఇక కొంతమంది ఈవెంట్స్ లో స్టేజిపై తమ గొంతుని విప్పుతారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా సింగర్ లా మారారు. నిన్న కరీంనగర్ లో ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ అనే రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. గెస్ట్ గా వెళ్లిన దిల్ రాజుని అక్కడ మ్యూజికల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాండ్ స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడమని కోరగా దిల్ రాజు నో చెప్పారు.

    ఇక అందరూ అడగడంతో తర్వాత మైక్ అందుకొని ఓ పాత అందుకున్నారు దిల్ రాజు. నాగార్జున ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే జీవితం’ పాటను దిల్ రాజు పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పాట విన్న తర్వాత దిల్ రాజు లోను మంచి సింగర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తే కచ్చితంగా దిల్ రాజుతో సినిమాలో పాటలు పాడిస్తారేమో అని అనిపిస్తుంది. దిల్ రాజు పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దిల్ రాజు ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ వీరి నిర్మాణంలో 50వ మూవీ కావడం విశేషం. త‌న బ్యాన‌ర్‌లో మ‌రే సినిమాకు పెట్ట‌నంత భారీ బ‌డ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.