Venkatesh-Vikram movie : ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్, ఎట్టకేలకు ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. అప్పట్లో త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించేవాడు. విక్టరీ వెంకటేష్, విజయ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ మరియు స్క్రిప్ట్ రైటర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాలు థియేటర్స్ లో సంచలన విజయం సాధించడమే కాకుండా, ఆల్ టైం క్లాసిక్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రాల్లోని ప్రతీ సన్నివేశం ఆరంభం నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ తో సహా మనం నోటి తో చెప్పేయగలం. అంతలా మన తెలుగు ఆడియన్స్ ఇష్టపడిన సినిమాలవి. ఈ చిత్రాల తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు.
Also Read : పాకిస్థాన్ నటుడికి అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్!
ఎట్టకేలకు 2017 వ సంవత్సరం లో, అంటే ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు ముందు ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందని ఒక అధికారిక ప్రకటన చేశారు. ప్రకటన అయితే చేశారు కానీ, ఇన్నాళ్లు కార్య రూపం దాల్చలేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. తన తదుపరి చిత్రం కూడా అదే రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఎన్నో కథలు విన్న తర్వాత, చివరికి త్రివిక్రమ్ స్టోరీ ని ఖాయం చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా చాలా సమయం గ్యాప్ దొరకడం తో విక్టరీ వెంకటేష్ తో సినిమా సెట్ చేసుకునే అవకాశం దక్కింది. ఈ కాంబినేషన్ మ్యాజిక్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి 300 కోట్లు కాదు, 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత స్టామినా ఉన్న కాంబినేషన్ ఇది.
ఈ చిత్రం లో వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ ఉంటాయట. ఒక మిడిల్ క్లాస్ స్టోరీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో చేయబోతున్నాడట. ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రం కూడా ఆ స్టైల్ లో ఉంటుందట. అన్ని కలిసొచ్చి, ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటే మన ఊహకు కూడా అందని వసూళ్లు వస్తాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్. హారికా & హాసిని సంస్థ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. వెంకటేష్ ని తన జోన్ లోకి తీసుకొచ్చి సినిమాలు తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొంటాయి. ఆరు పదుల వయస్సు దాటినా ఆ అద్భుతాలను మనం ఆయన ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి.