Prakash Raj : విలక్షణ నటుడిగా, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ, జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న నటులలో ప్రకాష్ రాజ్(Prakash Raj) పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ఒకప్పుడు ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో ప్రకాష్ రాజ్ కచ్చితంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాల్లో కంటే ఎక్కువగా వివాదాల్లోనే కనిపిస్తున్నాడు. ట్విట్టర్ లో ‘#JustAsking’ అనే ట్యాగ్ మీద తనకు తోచిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. సమాజం లో ఏ మతం మీద దాడి జరిగినా వెంటనే స్పందించి, తన గొంతుకను వినిపించే ప్రకాష్ రాజ్, హిందువులపై దాడి జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటాడని, అతను హిందూ మతం పై ద్వేషం పెంచుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో ప్రకాష్ రాజ్ కి ఒక చెడ్డ పేరుంది. రీసెంట్ గానే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై మన దేశప్రజలు ఎంత ఆవేశంతో రగిలిపోతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం.
Also Read : ‘పెళ్లి చూపులు’ కాంబినేషన్ రిపీట్..విచిత్రమైన టైటిల్ ని ఫిక్స్ చేసిన తరుణ్ భాస్కర్!
ఈ దాడికి కౌంటర్ గా మన భారతదేశ ప్రభుత్వం ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంది. పాకిస్థాన్ కి మన దేశం తో ఉండే అన్ని సంబంధాలను కట్ చేస్తూ, ఆ దేశానికీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే సార్క్ వీసా తో ఇక్కడ కొనసాగుతున్నారో, తక్షణమే ఇక్కడి నుండి పాకిస్థాన్ కి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలా భారత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో కఠినమైన నిర్ణయాలలో ఒకటి, పాకిస్థాన్ నటీనటులు మన ఇండియన్ సినిమాల్లో నటించకూడదు అని. ఆ కారణం చేత పాకిస్తాన్ హీరో ఫవాద్ ఖాన్, వాణీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అబీర్ గులాల్’ చిత్రం విడుదలను నిషేదించింది. అన్ని చక్కగా ఉండుంటే ఈ చిత్రం మే 9 థియేటర్స్ లోకి వచ్చేది. కానీ పెహల్గామ్ ఘటన తర్వాత ఈ చిత్రాన్ని భారతదేశ ప్రభుత్వం నిషేదించింది. దీనిపై ప్రకాష్ రాజ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రెస్పాన్స్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘సినిమాలను బ్యాన్ చేయడం సరికాదు. ప్రేక్షకుల్లోకి వచ్చిన తర్వాత ఆ సినిమాని చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. పాకిస్థాన్ నటుడు నటించినంత మాత్రానా ఆ సినిమాని బ్యాన్ చేయడం ఎంత వరకు కరెక్ట్. శృతి మించిన అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను, పిల్లలను వేధిస్తూ చూపించే సినిమాలను బ్యాన్ చేయండి తప్పు లేదు. మిగతా సినిమాలను నిషేధించడం కరెక్ట్ కాదు’ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. అసలు వీళ్లకు మనుషులు చనిపోయారు అనే బాధ ఇసుమంతైనా ఉందా?, ఇలాంటోళ్ళు అసలు ఈ సమాజం లో ఎలా తిరుగుతున్నారు అంటూ నెటిజెన్స్ ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.