Chhaava Movie : ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలలో ఒకటి ‘చావా'(Chhaava Movie). విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక(Rashmika Mandana) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రాన్ని హిందీ లో విడుదలైన మూడు వారాల తర్వాత డబ్ చేసి రిలీజ్ చేశారు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ప్రతీ ఒక్కరు చూడాలని తాపత్రయం పడ్డారు. అందుకే ఈ సినిమా థియేటర్స్ లో ఆ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గానే ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.
Also Read : విక్టరీ వెంకటేష్,త్రివిక్రమ్ మూవీ స్టోరీ లైన్ ఇదే..మరో సునామీ గ్యారంటీ!
అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని చూస్తుంటే స్ఫష్టంగా అర్థం అవుతుంది. ఈ సినిమా విడుదలైన రోజునే ‘కోర్ట్’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కేవలం రెండు మూడు రోజులు ‘చావా’ చిత్రం ‘కోర్ట్’ ని డామినేట్ చేసింది కానీ, ఆ తర్వాత అత్యధిక శాతం మంది కోర్ట్ చిత్రానికే ఎక్కువ మద్దతు చూపించారు. ఫలితంగా కోర్ట్ చిత్రం నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అవ్వగా, ‘చావా’ చిత్రం రెండవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కోర్ట్ చిత్రం నాల్గవ స్థానం లో ట్రెండ్ అవుతుండగా, ‘చావా’ చిత్రం ఏకంగా 7 వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా హిందీ సినిమాలకు నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఆ డిమాండ్ కి తగ్గ వ్యూస్ ‘చావా’ చిత్రం సొంతం చేసుకోలేకపోతుంది అనేది విశ్లేషకుల వాదన.
‘కోర్ట్’ చిత్రం కంటే ‘చావా’ చిత్రానికి తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ‘చావా’ చిత్రానికి కేవలం 9 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట. కోర్ట్ చిత్రానికి పది మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని అంటున్నారు . ‘చావా’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన అద్భుతాలకు, ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ కు ఎక్కడా పొంతన లేకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటంటే మన ఇండియన్ కంట్రీ సినిమాలను అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఓటీటీ ద్వారా చూస్తూ ఉంటారు. పాకిస్థాన్, బంగాళాదేశ్ వంటి కంట్రీస్ నుండి కూడా అత్యధికంగా చూస్తుంటారు. ప్రస్తుతం నెలకొన్ను ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ మతాలకు సంబంధించినది కాబట్టి, అక్కడి ఆడియన్స్ ఈ సినిమాని చూడడం మానేయడం వల్లనే వ్యూస్ రాలేదా వంటి సందేహాలు కూడా సోషల్ మీడియా లో వ్యక్తం అవుతున్నాయి.
Also Read : పాకిస్థాన్ నటుడికి అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్!