https://oktelugu.com/

Amma Rajasekhar : అమ్మ రాజశేఖర్ కొడుకుని ఎప్పుడైనా చూసారా..? ఈయన కూడా ఒక హీరోనే..చూస్తే ఆశ్చర్యపోతారు!

తనయుడు రాగిన్ రాజ్ ని హీరో గా పెట్టి రీసెంట్ గా 'తల' అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు అమ్మ రాజశేఖర్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమ్మ రాజశేఖర్, ఈ సందర్భంగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 10:35 PM IST

    Amma Rajasekhar

    Follow us on

    Amma Rajasekhar : గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో కొరియోగ్రాఫర్ గా మారి, తెలుగు , తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన వారిలో ఒకరిగా అమ్మా రాజశేఖర్ మన అందరికీ సుపరిచితుడే. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా ఈయన ఎంతో మంచి గుర్తింపు ని దక్కించుకున్నాడు. ఈయన తొలిసారిగా దర్శకుడిగా మారి, హీరో గోపీచంద్ తో చేసిన ‘రణం’ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత అమ్మ రాజశేఖర్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి ఎన్నో అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఈయనకు పిలిచి మరీ తన సినిమాకి దర్శకత్వం వహించాలని అడ్వాన్స్ ఇచ్చాడు. ప్రభాస్ తో కూడా ఆరోజుల్లో ఒక సినిమా చేయాల్సింది కానీ,ఆ అవకాశం మిస్ అయ్యింది.

    ‘రణం’ తర్వాత ఈయన మాస్ మహారాజ్ రవితేజ తో చేసిన ‘ఖతర్నాక్ ‘ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత అమ్మా రాజశేఖర్ కి దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో ఆయన ఆట, ఛాలెంజ్ వంటి డ్యాన్స్ షోస్ కి నయన నిర్ణేతగా వ్యవహరించి కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అదే విధంగా స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 4 అనే బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొని ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో మంచిగా అవకాశాలు సంపాదిస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ఎందుకో ఆయన ఊహించిన రేంజ్ అవకాశాలు మాత్రం రావడం లేదు.

    అయితే తనయుడు రాగిన్ రాజ్ ని హీరో గా పెట్టి రీసెంట్ గా ‘తల’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు అమ్మ రాజశేఖర్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమ్మ రాజశేఖర్, ఈ సందర్భంగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నా కొడుక్కి కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో ఈ రేంజ్ భారీ యాక్షన్ చిత్రం చేస్తున్న ఏకైక హీరో నా కొడుకు అని గర్వంగా చెప్పుకోగలను. ఈ కథని ముందుగా ఒక హీరో తో చేయాలని అనుకున్నాను, కానీ ఆ హీరో నాకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పట్టుదలతో నా కొడుకుని హీరో గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని చేశాను. యాక్షన్, సెంటిమెంట్, లవ్ ఇలా అన్ని ఈ చిత్రంలో పర్ఫెక్ట్ గా కుదిరాయి, మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈ క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.