Homeఎంటర్టైన్మెంట్Venkatesh: ‘సమరసింహారెడ్డి’ని మిస్ చేసుకున్న వెంకటేష్.. ఇంకా ఎలాంటి బ్లాక్ బస్టర్ ను వదులుకున్నాడు?

Venkatesh: ‘సమరసింహారెడ్డి’ని మిస్ చేసుకున్న వెంకటేష్.. ఇంకా ఎలాంటి బ్లాక్ బస్టర్ ను వదులుకున్నాడు?

Venkatesh: సినీ ఇండస్ట్రీలో కొన్ని అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కోసం నటులను ఎంపిక చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల వారిని మార్చాల్సి వస్తుంది. ముఖ్యంగా కొందరు డైరెక్టర్లు తమ సినిమాలకు హీరోలను సెలెక్ట్ చేసిన తరువాత వారు కథకు షూట్ కాకపోవడమో.. లేక కాల్షీట్లు కుదరకపోవడమో.. ఇతర కారణాల వల్ల హీరోలను మారుస్తూ ఉంటారు. గతంలో ఇలాంటి మార్పులు చాలా ఉండేవి. అయితే కొందరు స్టార్ హీరోలే తాము వద్దనుకున్న సినిమాలు ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. విక్టరీ వెంకటేష్ ‘సమరసింహారెడ్డి’ సినిమా చేయాల్సింది. కానీ కొన్నికారణాల వల్ల మిస్ అయింది. అలాగే మరికొన్ని బంపర్ హిట్లను కూడా విక్టరీ మిస్ చేసుకున్నాడు. అవేంటో చూద్దాం..

రోజా:
మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన రోజా మూవీ బ్లాక్ బస్టర్. ఇందులో అరవింద స్వామి హీరోగా, మధుభాల హీరోయిన్ గా నటించింది. మణిరత్నం తన సినిమాలకు అప్పట్లో ముందుగా తెలుగు హీరోలను సెలెక్ట్ చేసుకునేవారు. ఇందులో భాగంగా రోజా సినిమా కోసం మణిరత్నం వెంకటేష్ దగ్గరికి వచ్చాడు. కానీ వెంకీ ఆ సమయంలో చంటి సినిమాతో బిజీగా ఉండడం వల్ల ‘రోజా’ను రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఒకేఒక్కడు:
సౌత్ డైరెక్టర్ శంకర్ ఒకే ఒక్కడు సినిమాతోనే ఫేమస్ అయ్యాడు. అంతకుముందు ఆయన స్టార్ హీరోలతో చేయాలని ఆశ ఉండేది. దీంతో రజనీకాంత్ ను కలిశాడు. వారికి కథ నచ్చక వద్దన్నారు. చివరికి వెంకటేష్ వద్దకువచ్చాడు శంకర్. అయితే వెంకీ ఆ సమయంలో కలిసుందాం రా సినిమాలో నటిస్తుండగా కాల్సీట్లు కుదరకు నో చెప్పాడు.

సంతోషం:
ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరు వెంకటేష్. దీంతో దశరత్ సంతోషం కథను ముందుగా వెంకటేష్ కు చెప్పాడు. అయితే అలాంటి కథ తో సినిమా చేయలేనని చెప్పాడు. దీంతో ఇదే సినిమాను నాగార్జున చేయడంతో ఆ మూవీ బంపర్ హిట్టు కొట్టింది.

కృష్ణం వందే జగద్దురుం:
క్రీష్ డైరెక్షన్లో రానా హీరోగా వచ్చిన ఈ మూవీని ముందుగా వెంకటేష్ హీరో అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వెంకీ తప్పుకున్నాడు. దీంతో వెంటనే ఆయన అన్నకుమారుడు రానాతో తీశాడు. అియతే ఈ సినిమాలో వెంకీ ఓ సాంగ్ లో కనిపిస్తాడు.

గోవిందుడు అందరివాడేలే:
మెగా హీరో రామ్ చరణ్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన మూవీ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో వెంకటేష్ ను ఊహించుకుంటే సెట్ అయ్యేవారని కొందరు ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అయితే ఇందులో శ్రీకాంత్ పాత్ర కోసం వెంకటేష్ ను అనుకున్నారు. కానీ అలా సైడ్ క్యారెక్టర్ చేయనని వెంకటేష్ అనడంతో శ్రీకాంత్ ను దించారు.

క్రాక్:
మాస్ మహరాజ రవితేజ హీరోగా వచ్చిన ‘క్రాక్’ మూవీని వెంకటేష్ చేయాల్సి ఉండేది. డైరెక్టర్ గోపిచంద్ ఈ కథను వివరించగా కనెక్ట్ కాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత రవితేజ ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version