Venkatesh New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. యంగ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రీతిలో విజయాలను అందుకోవడంలో వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఈ మధ్యకాలంలో మంచి సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అయితే ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా వరుస బెట్టి సినిమాలను చేస్తున్నాడు. 2025వ సంవత్సరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఈ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో ఒక క్యామియో రోల్ పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వల్లే ఈ సినిమా మరొక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి.
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమా 2027 సంక్రాంతి కానుక ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మొత్తానికైతే అక్టోబర్ లో ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న వెంకటేష్ మూడు నెలల తర్వాత సంక్రాంతికి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందట. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు సైతం మూడు నెలల్లోనే వెంకటేష్ భారీ బిజినెస్ అయితే జరుపుకోబోతున్నాడు. దాదాపు 500 నుంచి 600 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టే సినిమాలు అతను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఆయన 600 కోట్ల కలెక్షన్స్ ని ఈజీగా రాబడతాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
