Venkatesh character name in Trivikram film : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… తను చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా భారీ విజయాలను కట్టబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోలందరితో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh) తో ఒక యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మొత్తానికైతే ఈ సినిమా జూన్ నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసిన త్రివిక్రమ్ తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదిఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ గత 20 సంవత్సరాలు నుంచి వార్తలు వస్తున్నప్పటికి ఇప్పటివరకు అది కార్య రూపం దాల్చలేదు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో త్రివిక్రమ్ తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. వెంకటేష్ (Venkatesh) సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా తర్వాత మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించి తన మార్కెట్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ పేరు బ్రహ్మానందం (Bramhanandam) అని పెట్టారట…
ఈ మూవీలో వెంకటేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడట. అందువల్లే అతనికి ఆ పేరు పెట్టినట్టుగా సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ పేరు వెంకటేష్ కి చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా ‘హాస్య బ్రహ్మ’ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్రహ్మానందం లాంటి గొప్ప కమెడియన్ పేరుని వెంకటేష్ కి పెట్టడం ఈ సినిమాలో అదొక పెద్ద కామెడీగా మారబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే గురుజీ రాసే డైలాగులకు వెంకటేష్ ఇచ్చే హావభావాలు చెప్పే డైలాగ్ మాడ్యులేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఇక థియేటర్లో ప్రేక్షకులు విపరీతంగా నవ్వబోతున్నారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నప్పటికి ఇంకా ఎవరిని ఫైనలైజ్ చేయలేదు. చూడాలి మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది…