Venkatesh And Trivikram Movie Latest Update: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో ఒక సినిమా రీసెంట్ గానే మొదలైంది. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ ని ఇష్టపడని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో వీళ్లిద్దరి కలయిక లో నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి వంటి చిత్రాలు వచ్చాయి. ఎన్ని సార్లు చూసినా, మరోసారి చూడాలి అనిపించే సినిమాలు ఇవి. ఈ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ప్రతీ డైలాగ్ చెవుల్లో అమృతం పోసినట్టు గా అనిపిస్తాది, ఇది కదా సినిమా అంటే అనే ఫీలింగ్ ని కలిగిస్తాది.
అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కాబట్టే, ఈ చిత్రం పై ప్రారంభ దశ నుండే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ రూమర్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ ని కలిగిస్తోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పెషల్ క్యామియో రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ లో కథ ని మలుపు తిప్పే అతిథి పాత్రలో ఆయన కనిపిస్తాడట. ఇదే కనుక జరిగితే ఈ సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో స్పెషల్ రోల్ చేసాడు. చిరంజీవి కాంబినేషన్ లో చాలా సన్నివేశాలు కూడా ఉంటాయట, ఆయన ఈ చిత్రం లో కనిపించే 20 నిమిషాలు మెగా ఫ్యాన్స్ మరియు వెంకటేష్ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది అట.
అలాంటి సినిమా తర్వాత వెంటనే మరోసారి చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం విశేషం. త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ లో చిరంజీవి స్పెషల్ రోల్ లో కనిపిస్తాడా?, లేదంటే కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తాడా అనేది పక్కన పెడితే, త్రివిక్రమ్ కచ్చితంగా ఆయన క్యామియో ని భారీ లెవెల్ లో ప్లాన్ చేసి ఉంటాడని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా, క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ప్రతీ ఒక్కరి హృదయాలను టచ్ చేసే విధంగా ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ లోనే మెగాస్టార్ ని చూపించబోతున్నాడంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటాడో మీరే ఊహించుకోండి. చూడాలి మరి ఈ మ్యాజికల్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది.