Bigg Boss 9 Telugu Tanuja Vs Pawan: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కి వచ్చినంత టీఆర్ఫీ రేటింగ్స్ గడిచిన నాలుగు సీజన్స్ లో ఏ సీజన్ కి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్ కుటుంబ బంధాల మధ్య సాగడం వల్లే ఈ రేంజ్ రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు. అయితే టైటిల్ విన్నర్ రేస్ ఇంత కఠినతరంగా ఉండడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. గత సీజన్స్ లో ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది స్పష్టంగా 8 వారాలకే అర్థం అయ్యేది. కానీ ఈ సీజన్ మాత్రం అలా లేదు. నిన్న మొన్నటి వరకు తనూజ, పవన్ కళ్యాణ్ మధ్యనే ఈ టైటిల్ రేస్ ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి డిమోన్ పవన్ కూడా వచ్చి చేరాడు. డిమోన్ పవన్ మొదటి నుండి టాస్కులు ఆడడంలో బీస్ట్ రేంజ్ అనే చెప్పాలి. డిమోన్ పవన్ బరిలో దిగాడంటే అవతల ఎంతటి మనిషి అయినా ఓడిపోవాల్సిందే.
అలాంటి కంటెస్టెంట్ అతను. అయితే రీతూ చౌదరి తో రిలేషన్ కారణంగా ఆయన చాలా వెనకబడ్డాడు అనే వాదన బలంగా వినిపించేది. రీతూ చౌదరి తో రిలేషన్ లేకుండా ఉండుంటే, కచ్చితంగా ఆయన టాప్ 1 రేంజ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ తో ఉండేవాడని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎప్పుడైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యిందో, అప్పటి నుండే డిమోన్ పవన్ బాగా అభివృద్ధి చెందాడని, టాస్కులు మరింత ఉత్సాహంగా ఆడడం మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా బీభత్సంగా ఇస్తున్నాడని అంటున్నారు. ఇక గడిచిన రెండు రోజుల్లో ఆయన టాస్కులు ఏ రేంజ్ లో ఆడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సోమవారం రోజున మూడు టాస్కులు జరిగితే, రెండు ఆయనే గెలిచాడు. ఇక నిన్న అయితే నాలుగు టాస్కులు జరగ్గా, అందులో రెండు ఆయనే గెలిచాడు. ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, తనూజ అయితే గత రెండు రోజులుగా టాస్కుల్లో డిమోన్ పవన్ ని తట్టుకోలేకపోతున్నారు.
తనూజ అయితే తనలోని అసూయ ని మొన్నటి ఎపిసోడ్ లో బయటపెట్టేసింది. సెకండ్ ఫైనలిస్ట్ టాస్కుల్లో గత వారం వాడు జోకర్ టాస్కు కూడా ఆడలేక ఓడిపోయాడు. ఇప్పుడు ఎదో ఫన్ కోసం పెడుతున్న టాస్కులు ఆది గెలుస్తున్నాడు. పోనీలే వాడికి ఆ తృప్తిని అయినా మిగిలిద్దాం అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇక నిన్న చూపించిన ప్రోమో లో హౌస్ మేట్స్ అందరూ కలిసి డిమోన్ టార్గెట్ చేయడం కూడా మనమంతా చూసాము. ప్రస్తుతం అధికారిక ఓటింగ్ ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ 26 శాతం తో కొనసాగుతుండగా, తనూజ 25 శాతం తో, డిమోన్ పవన్ 23 శాతం తో కొనసాగుతున్నాడు. చూస్తుంటే ముగ్గురి మధ్య తేడా ఏమి పెద్ద లేదు. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరైనా టైటిల్ కొట్టొచ్చు, వీళ్ళ అభిమానులు బలంగా ఓట్లు వేసుకోయ్ గెలిపించేందుకు ప్రయత్నం చేయండి.