NTR Prashanth Neel Dragon: ‘సలార్’ వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఎన్టీఆర్(Junior NTR) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడు, ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో తో సినిమా అంటే, ఆ మాత్రం షేక్ అవ్వడం లో ఆశ్చర్యం ఏమి లేదు కదా. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. అయితే ఈ షెడ్యూల్స్ తర్వాత భారీ గ్యాప్ వచ్చింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది అంటూ వార్తలు వినిపించాయి, కథ రీత్యా ఒక్క భాగంగా కాదు, రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనే వార్త కూడా వినిపించింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇంకా మొదలు అవ్వలేదని తెలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయట. ఇద్దరి మధ్య ఒక అభిప్రాయం ఏర్పడలేదని, కథ విషయం లో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, తీసిన ఔట్పుట్ పై కూడా ఆయన వంకలు పెడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. ప్రశాంత్ నీల్ కి ఏ సన్నివేశం కూడా ఒక పట్టాన నచ్చదు. ఈయన రాజమౌళి కి మించిన జక్కన్న అని ఇండస్ట్రీ లో పేరుంది. అలాంటిది ఆయనకు నచ్చిన సన్నివేశాలు కూడా ఎన్టీఆర్ కి నచ్చలేదంటే, ఎక్కడో ఎదో వీళ్లిద్దరి మధ్య తేడా కొడుతోంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇలాగే కొనసాగితే అసలు ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. గతం లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉంటుందా లేదా అనే భయం ఫ్యాన్స్ లో మొదలైంది.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ రుక్మిణీ వాసంత్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు మొదటి పార్ట్ ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ ఇలా అడుగడుగునా అడ్డంకులు ఉంటే అనుకున్న తేదికి ఈ సినిమా రావడం అసాధ్యం లాగానే అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. ఈ చిత్రం డ్రగ్స్ కార్తల్ నేపథ్యం లో సాగుతుందట. యదార్ధ సంఘటనల ఆధారంగా చేసుకొని తీస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్.