spot_img
Homeఆధ్యాత్మికంUgadi Festival : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏంటో తెలుసా?

Ugadi Festival : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏంటో తెలుసా?

Ugadi Festival : తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన ఉగాది పండుగ వచ్చేసింది. ఈ ఏడాది ఉగాది పండును మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఇంటి మొత్తం ఈ ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కేవలం తెలుగు వారు మాత్రమే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరం ఎంతో ముఖ్యమైనది. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి కొత్త దుస్తులు ధరించి పూజలు నిర్వహిస్తారు. వేపాకు, మామిడి కాయలు ఇలా షడ్రురుచులతో పచ్చడి తయారు చేసి తింటారు. అయితే ఈ కొత్త సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ ఉగాదికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. మొత్తం తెలుగు క్యాలెండర్లలో 60 పేర్లు ఉంటాయి. ఒక్కో ఏడాది ఒక్కో పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇలా ఏడాదికి పేరు మారుతుంది. అయితే ప్రతీ ఏడాది వచ్చే కొత్త సంవత్సరానికి ఉండే పేరుకు ఓ అర్థం ఉంటుంది. మరి ఈ ఏడాది వచ్చే శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి అర్థం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Also Read : ఉగాది రోజు తప్పకుండా చేయాల్సిన పనులివే

ప్రతీ ఏడాది వచ్చే కొత్త సంవత్సరానికి ఓ అర్థం ఉన్నట్లు ఈ ఏడాది వచ్చే శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి కూడా ఉంది. అయితే శ్రీ అనేది సంపద, పవిత్రత, భక్తి, శుభ్రం, ఐశ్వర్యం వంటి వాటిని సూచిస్తుంది. విశ్వావసు అనేది ఏదైనా శుభాన్ని సూచిస్తుంది. ఈ కొత్త సంవత్సరం అయినా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభాలు జరుగుతాయి. అలాగే ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో చాలా మందికి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ పనిలో అయినా కూడా నష్టాలు కాకుండా లాభాలను ఇస్తుందట. ముఖ్యంగా అందరి ఇంట్లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. అలాగే దేశాల మధ్య ఎలాంటి వైరం, యుద్ధాలు ఉన్నా కూడా ఈ కొత్త సంవత్సరం అన్ని కూడా ఆగిపోతాయట. అందరూ కూడా ప్రేమతో ఇతరులతో వ్యవహరిస్తారు. ఈ కొత్త ఏడాదిలో ప్రతీ ఒక్కరికి మంచి జరుగుతుందని అంటున్నారు. అన్ని చోట్ల కూడా క్షేమమే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే రైతులకు కూడా బాగా పంటలు పండుతాయి. సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా దుస్తుల వ్యాపారం చేసే వారికి బాగా కలసి వస్తుందని పండితులు అంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం క్షేమాన్ని, మంచిని ఇచ్చేదని అర్థం.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.
Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper