Samantha : మన సౌత్ ఇండియన్స్ ఒక హీరో ని కానీ, హీరోయిన్ ని కానీ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో హీరో, హీరోయిన్లను దేవుళ్ళు లాగా కొలుస్తుంటారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఈమె ‘ఏం మాయ చేశావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతి తక్కువ సమయంలోనే ఇటు తెలుగులో, అటు తమిళంలో స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ 1 హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియా లో కూడా ఈమెకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ముఖ్యంగా ఈమె నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఎదురుకున్న పరిణామాలను చూసి ఆమె వ్యక్తిత్వానికి వీరాభిమానులు అయిపోయారు.
Also Read : కన్నప్ప’ విడుదల వాయిదా..కారణం ఏమిటంటే!
ఇది ఇలా ఉండగా హీరోయిన్స్ కి దేవాలయాలు కట్టే సంస్కృతి తమిళనాడులో ఇంతకు ముందు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఆంధ్ర ప్రదేశ్ కి కూడా ఎగబాకింది. తెనాలి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు, సమంత ని హీరోయిన్ గా కంటే ఒక మనసున్న మంచి వ్యక్తిగా ఆరాధించాడు. ఆమె పై తన అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక, అచ్చు గుద్దినట్టు ఆమె పోలికలతో ఒక విగ్రహాన్ని తయారు చేసి, దానికి గుడి కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రతీ చిన్న విషయానికి ఎంతో ఎమోషనల్ అయిపోయే సమంత, ఈ వీడియో ని చూస్తే ఏమైపోతుందో అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంత ని ట్యాగ్ చేసి ఆమెకు ఆ వీడియో ని రీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరి సమంత ఈ వీడియో ని చూస్తుందా లేదా..?, చూసిన తర్వాత ఆ అభిమానిని గుర్తించి కలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే సమంత చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడం తో మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యింది. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి, సినిమాలను నిర్మించే కార్యక్రమానికి కూడా ఆమె శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కొత్తవాళ్లతో ఆమె చేసిన ‘శుభం'(Subham Movie) అనే చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రేపు విడుదల చేయబోతున్నారు. ఇక సమంత హీరోయిన్ గా నటించే సినిమాల విషయానికి వస్తే ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆమెనే. ఈ చిత్రంతో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read :నాగచైతన్య పై సమంత కామెంట్స్ ఆగేలా లేవుగా?
View this post on Instagram