Veera Simha Reddy First Review: 2023 సంక్రాంతి హీరోలు తమ చిత్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విన్నర్ మేమే కావాలని కోరుకుంటున్నారు. మూడేళ్ళ తర్వాత బడా చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. చిరంజీవి-బాలకృష్ణ పోటీ పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. సాంగ్స్, ప్రోమోలు, ట్రైలర్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముదులపడం ఖాయం.

వీరసింహారెడ్డి చిత్ర విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి యూ/ఏ అందుకుంది. కాగా వీరసింహారెడ్డి చిత్రంపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు మూవీ ఎలా ఉందో తన అభిప్రాయం తెలియజేశాడు. సినిమాలోని పాజిటివ్ అంశాలు ప్రస్తావిస్తూ రేటింగ్ కూడా ఇచ్చాడు. ఉమర్ సంధు వీరసింహారెడ్డి చిత్రానికి టాప్ రేటింగ్ ఇచ్చిన క్రమంలో ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉమర్ సంధు వీరసింహారెడ్డి చిత్రం బాగుందంటూ ప్రశంసలు కురిపించాడు.
”వీరసింహారెడ్డి చిత్రానికి బాలకృష్ణ ప్రధాన బలం. ఆయన గొప్ప నటన కనబరిచారు. మాస్ పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడమే కాకుండా… ఎమోషనల్ సన్నివేశాల్లో కన్నీరు తెప్పించారు” అని ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఇక వీరసింహారెడ్డి చిత్రానికి ఆయన ఇచ్చిన రేటింగ్ 3.5/5. అది బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఇచ్చే రేటింగ్. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

వీరసింహారెడ్డి చిత్రాన్ని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరసింహారెడ్డిలో సైతం బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు ధునియా విజయ్ విలన్ రోల్ చేశారు. థమన్ సంగీతం అందించారు. జనవరి 12న వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. 11న యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. అక్కడ ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల హీరోయిన్స్, నిర్మాతలు ఒక్కరే కావడం విశేషం.
First Review #VeeraSimhaReddy ! #NandamuriBalakrishna is the biggest asset of the film. He has given a tremendous performance. #Balakrishna not only impresses the masses with his punch dialogues but also moves them to tears with his emotional avatar in some scenes.
3.5⭐️/5⭐️
— Umair Sandhu (@UmairSandu) January 9, 2023