Veera Dheera Shoora 2 : కొన్ని సినిమాలు ఎలాంటి హంగామా లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన ఫలితాలను అందుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) నటించిన ‘వీర ధీర శూర 2′(Veera Dheera Sooran 2) చిత్రానికి అలాంటి ఫలితమే ఎదురైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు ఫైనాన్సియల్ సమస్యల కారణంగా కోర్టు స్టే విధించడంతో సాయంత్రం షోస్ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. టాక్ ఒక రేంజ్ పాజిటివ్ లో రాలేదు, అలా అని నెగిటివ్ గా కూడా రాలేదు. పర్వాలేదు బాగానే ఉంది, ఒకసారి చూసేయొచ్చు అనే రేంజ్ టాక్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు విడుదల అవుతున్న సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి ఇలాంటి టాక్ తెచ్చుకుంటే మాత్రం రెండవ రోజే సర్దేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈమధ్య కాలం లో ఎన్నో ఉదాహరణలు మనమంతా చూసాము. కానీ విక్రమ్ బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ సినిమా స్టడీ వసూళ్లను నమోదు చేసుకుంటున్నాయి.
Also Read : తెలుగు సినిమాలను చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది – విక్రమ్
ఓపెనింగ్స్ అనుకున్నంతగా రాలేదు కానీ, వర్కింగ్ డేస్ లో మాత్రం చాలా స్టడీ గా బాక్స్ ఆఫీస్ రన్ ని సొంతం చేసుకుంటుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం మొదటి వారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 41 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ముఖ్యంగా తమిళనాడు లో ఈ చిత్రం సాలిడ్ హోల్డ్ ని కనబరుస్తూ ముందుకెళ్తుంది. ఆరవ రోజున కేవలం తమిళ నాడు నుండి రెండు కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, 7 వ రోజున రెండు కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రం మొదటి వారం 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి రెండు కోట్ల 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 కోట్ల 5 లక్షల గ్రాస్, ఓవర్సీస్ లో 7 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి వారం తెలుగు, తమిళ భాషలకు కలిపి 41 కోట్ల రూపాయిల గ్రాస్, 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 38 కోట్ల రూపాయలకు జరిగింది. స్టడీ కలెక్షన్స్ ని చూస్తుంటే పాజిటివ్ మౌత్ టాక్ బలంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ పూర్తి అయ్యాక ఈ సినిమా పాతిక కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటేస్తుందని, ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ మందుకు బానిస అయ్యాడా..? అలా మారడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు…