L2: Empuraan : ఈమధ్య కాలంలో విడుదల అవుతున్న కొన్ని సినిమాలను చూస్తుంటే, ప్రీ రిలీజ్ హైప్ కచ్చితంగా ఉండాలి అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రీ రిలీజ్ హైప్ భారీగా ఉంటే టాక్ లేని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగబడి ఆడేస్తున్నాయి. అదే హైప్ లేకపోతే బాగున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అలా విడుదలకు ముందు కనీవినీ ఎరుగని భారీ హైప్ ని ఏర్పాటు చేసుకొని, విడుదల తర్వాత మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిత్రం మోహన్ లాల్(Mohanlal) నటించిన ‘L2 : ఎంపురాన్'(L2: Empuraan). 2019 వ సంవత్సరంలో మలయాళం సినిమా ఇండస్ట్రీ ని ఊపేసిన ‘లూసిఫర్’ చిత్రానికి ఇది సీక్వెల్. అందుకే మోహన్ లాల్ గత చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ అయినప్పటికీ, ఈ సినిమాపై ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం అయ్యింది.
Also Read : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’
మొదటి రోజు 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ప్రాంతాలవారీగా ఒకసారి పరిశీలిద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటివారంలో దాదాపుగా 236 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మలయాళం సినిమాకు ఇది సాధారణమైన విషయం కాదు. మలయాళం వరకు కూడా కాదు, తెలుగులోనే ఇప్పటి వరకు అనేకమంది స్టార్ హీరోలు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క కేరళ రాష్ట్రం నుండే ఈ సినిమాకు మొదటి వారంలో 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ ఇండస్ట్రీ లో ఇలాంటి వసూళ్లు ఏ సినిమాకు కూడా రాలేదు.
అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 3 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అదే విధంగా తమిళనాడు లో 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 18 కోట్ల రూపాయిల గ్రాస్, అదే విధంగా ఓవర్సీస్ లో 135 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 236 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని, ఓవరాల్ వరల్డ్ వైడ్ ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల మార్కుకి కచ్చితంగా చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : 5 రోజుల్లో 200 కోట్లు..ఓవర్సీస్ లో ‘L2 : ఎంపురాన్’ సరికొత్త బెంచ్ మార్క్!