https://oktelugu.com/

బీరుపై ప్రేమను చాటుకున్న మళయాళ బ్యూటీ

మళయాళ బ్యూటీ వీణా నందకుమార్ అభిమానులకు బీరు పాఠాలను చెబుతుంది. బీరుపై తనకున్న ఇష్టం, ప్రేమను ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ‘చాలామంది యువతకు ఈ రోజుల్లో బీరు తాగడం అలవాటుగా మారిందని’ చెప్పింది. బీరు తాగడం నేరమేమీ కాదని.. తాను బీరు తాగతానని చెప్పడానికి ఎందుకు భయపడాలి? అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీణా కామెంట్లపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. వీణా నందకూమార్ తాజాగా నటించిన చిత్రం ‘కెట్టోయ్ లాన్ ఎంటె […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 4, 2020 / 05:34 PM IST
    Follow us on

    మళయాళ బ్యూటీ వీణా నందకుమార్ అభిమానులకు బీరు పాఠాలను చెబుతుంది. బీరుపై తనకున్న ఇష్టం, ప్రేమను ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ‘చాలామంది యువతకు ఈ రోజుల్లో బీరు తాగడం అలవాటుగా మారిందని’ చెప్పింది. బీరు తాగడం నేరమేమీ కాదని.. తాను బీరు తాగతానని చెప్పడానికి ఎందుకు భయపడాలి? అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీణా కామెంట్లపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.

    వీణా నందకూమార్ తాజాగా నటించిన చిత్రం ‘కెట్టోయ్ లాన్ ఎంటె మాలఖా’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘వీణా రిన్సీ’ అనే పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో ఆమె తనకున్న డ్రింకింగ్ అలవాటును వెల్లడించారు. ‘బీరు తాగడమంటే నాకెంతో ఇష్టం’ అంటూ బీరుపై తన ప్రేమను చాటుకుంది. ‘బీరు తాగి నేనేవరినీ ఇబ్బంది పెట్టలేదని.. నా వ్యక్తిగత అవసరాల కోసం నేను బీరుతాగుతున్నా’ అంటూ వివరించింది. ఈ కామెంట్లపై ఆమెకు కొందరు మద్దతు ఇస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.

    సెలబెట్రీలు తమకున్న చెడ్డ అలవాట్లను అభిమానులు చెబితే వాళ్లు చెడిపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి సినీతారలు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో శృతిహాసన్ కూడా తనకు వైన్ అంటే బాగా ఇష్టమని చెప్పింది.. ఆ తర్వాత ఆరోగ్యం దృష్ట్యా మానేసినట్లు శృతిహాసన్ చెప్పింది. బీరు తాగే యువత మాత్రం వీణా నందకుమార్ కు సపోర్ట్ చేస్తున్నారు. వీరి సంఖ్య బాగానే ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎవరికీ ఇష్టమైన అలవాట్లు పాటించడంలో తప్పేమీ లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.