ఆ ఒక్క విషయంలో జగన్ కి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఏపీ సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక విషయంలో ఆయనకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అదే విషయాన్ని చంద్రబాబు లేఖ రాసి మరీ జగన్ కి తెలియజేసారు. ఎన్నికల రిజర్వేషన్ లలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ ని కోరారు. అందుకు టీడీపీ కూడా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం […]

Written By: Neelambaram, Updated On : March 4, 2020 7:54 pm
Follow us on


ఏపీ సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక విషయంలో ఆయనకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అదే విషయాన్ని చంద్రబాబు లేఖ రాసి మరీ జగన్ కి తెలియజేసారు. ఎన్నికల రిజర్వేషన్ లలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ ని కోరారు. అందుకు టీడీపీ కూడా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు.

గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌ నంబరు 176ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.. అదే విధంగా బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 9, 15, 152, 180ను రద్దు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ఇదే విషయాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావిస్తూ..అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపి 34% రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ సాధికారత కాపాడటం ముఖ్యమంత్రిగా ధర్మమని.. ఇప్పటికైనా తక్షణమే స్పందించి 34% బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వెంటనే వేయాలని, ఇందుకు తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.