VarunTej- Niharika: మెగా కాంపౌండ్ నుంచి ఏ చిన్న న్యూస్ అయినా ఇట్టే వైరల్ అవుతుంది. ఈమధ్య వారి పర్సనల్ విషయాలు కూడా బయటికి రావడంతో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా డాటర్స్ పెళ్లి విషయాలపై కొందరు పదే పదే చర్చిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతుందని కొందరు పోస్టులు పెట్టారు. తాజాగా మెగా హీరో కం నిర్మాత అయిన నాగబాబు కూతురు నిహారిక విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆమె కొన్ని వివాదాల సుడిగుండంలో చుట్టుకోవడంతో ఓ మెగా హీరో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాకుండా మరోసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ సూచనలు, సలహాలు ఇచ్చాడుట. ఇంతకీ ఏం జరిగిందంటే..?

రాజస్థాన్ ప్యాలెస్ లో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చైతన్య జొన్నలగడ్డ ను ఆమెను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానంలో ఆమె వివాహానికి కొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఆ తరువాత ఆమె అనుకోకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ తరువాత భర్తకు దూరంగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తోడుగా ఆమె ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే కనిపిస్తుండడంతో నిజంగానే భర్తకు దూరమవుతుందా..? అని మరికొందరు ఆ పోస్టులకు బలం చేకూర్చారు.
అయితే తాజాగా ఆమె ప్రవర్తనపై సోదరుడు వరుణ్ తేజ్ ఫైర్ అయ్యాడట.‘నోర్ ముయ్.. ఏదైనా డెసిసన్ తీసుకునేముందు పెద్దలను సంప్రదించాలి. విడాకుల విషయంలో నీ నిర్ణయం ఉంటే సరిపోతుందా..? ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి.. అనివారించాడట. అంతేకాకుండా పబ్బులకు వెళ్లడానికి ఇంకా నువ్వు చిన్న పిల్లవు కాదు.. నీకంటూ ఓ బాధ్యత ఉంది.. ఏ విషయమైనా భర్తతో షేర్ చేసుకోవాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భర్తకంటే ఏదీ గొప్పకాదు.. ’అని అన్నాడట. అయితే ఇదంతా నాగబాబు సమక్షంలో జరిగిందా..? లేక ప్రైవేట్గా వార్నింగ్ ఇచ్చారా..? అని తెలియాల్సి ఉంది.

సాధారణంగానే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో ఆమె ఎక్కడికి వెళ్లినా భర్త చైతన్యతో కలిసి పిక్స్ షేర్ చేసేది. కానీ ఈమధ్య ఒంటరిగా సెల్పీలను సోషల్ మీడియాకు షేర్ చేస్తోంది. దీంతో నిహారిక భర్తకు దూరంగా ఉంటోందని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిహారిక ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే విషయం పెద్దదిగా మారనుంది.. అని మెగా ఫ్యాన్స్ సూచిస్తున్నారు.