Heroines Kiss Scenes: ఒకప్పుడు ఒక సినిమాలో ముద్దు సీన్ ఉందంటే ఆ సినిమా కోసం కుర్రకారు పరుగులు పెట్టేది. ఇప్పుడు పెద్ద విషయం కాదనుకోండి.. అయితే ఆ కాలంలో ముద్దు సీన్లలో నటించడానికి అటు హీరో.. ఇటు హీరోయిన్ ను డైరెక్టర్ ఎన్నో కష్టాలు పడి ఒప్పించేవారు. కాలక్రమంగా చెంపలపై ఒకే చెప్పేవారు. ఆ తరువాత లిప్ టూ లిప్ కిస్ కూడా రెడీ అన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నా సై అంటున్నారు. ఈ కాలంలో ముద్దు సీన్లకు ఏ నటి అడ్డు చెప్పడం లేదు. అలాంటి సీన్లలో నటిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని కొందరు ఆ సీన్లకు అడిగిన వెంటనే ఓకే చెబుతున్నారు. కొందరు మాత్రం అలాంటి వాటికి కాస్త రెమ్యూనరేషన్ పెంచుతున్నారు. అయితే 1990ల కాలంలో ఇలాంటి ముద్దు సీన్ల విషయంలో కొందరు నటీమణులు ఒప్పుకోలేదు. మరికొందరు తమను బలవంతంగా ముద్దు సీన్లలో నటించమన్నారని గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవల కారణంగా వారు ఇండస్ట్రీనే వదిలేయాల్సి వచ్చింది. ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

మీరాచోప్రా:
పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాతో మీరా చోప్రా తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘వాన’ అనే సినిమాలో కూడా నటించింది. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా.. తమిళంలో చాలానే అవకాశాలు తెచ్చుకుంది. ఆ తరువాత కనుమరుగైపోయింది నటి. అయితే ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లడానికి ఓ తెలుగు హీరోనే కారణమని ఇండస్ట్రీ టాక్. ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆయన తనను బలవంతంగా ముద్దు సీన్ పెట్టించాలన్నాడట. అందుకు ఒప్పుకోని మీరా చోప్రా ఏకంగా సినీ పరిశ్రమనే వదిలి వెళ్లింది.
మాళవిక:
తెలుగులో ‘చాలా బాగుంది’ సినిమాతో స్టార్ నటి అయిన మాళవిక ఆ తరువాత పలు ఫ్యామిలీ చిత్రాల్లో నటించింది. ఆ తరువాత అప్పుడప్పుడు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తో ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ అనే సినిమా చేయాల్సి వచ్చింది. ఈ సినిమా సమయంలో హీరో తనను ముద్దు సీన్లు చేయమంటున్నారని గొడవ చేసింది. అయితే ఆమె చేసిన ఆరోపణలన్నీ అవవాస్తమే అనడంతో మనస్థాపంతో మరో తెలుగు సినిమా చేయలేదు.

జరీనా ఖాన్:
హిందీలో పలు సినిమాల్లో నటించిన జరీనా ఖాన్ తెలుగులో గోపీచంద్ తో కలిసి ‘చాణక్య’ సినిమా చేసింది. అయితే ఓ బాలీవుడ్ హీరో తనతో ముద్దు రిహార్సల్స్ చేయాలని బలవంతం పెట్టాడట. ఇదే సమయంలో చాణక్య సినిమా రావడంతో అందరూ గోపీచంద్ అని అనుకున్నారు. కానీ జరీనా ఖాన్ తెలుగు హీరో కాదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివాదాలకు కేరాఫ్ గా ఉన్న జరీనా ఖాన్ కు ఆ తరువాత ఎవరూ అవకాశం ఇవ్వలేదు.