Matka: చాలా కాలం నుండి సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న యంగ్ హీరోలలో ఒకరు వరుణ్ తేజ్. కెరీర్ లో ఈయనకి ఉన్నన్ని క్రేజీ బ్లాక్ బూస్టర్లు రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఏ హీరోకి కూడా పడలేదు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 , గద్దలకొండ గణేష్, ఎఫ్3, ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకొచ్చిన వరుణ్ తేజ్ ని చూసి మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో స్టార్ లీగ్ లోకి రాబోతున్నాడని అభిమానులు అనుకున్నారు. కానీ వరుణ్ తేజ్ కి భిన్నమైన ఆలోచన శైలి ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడానికి అతను ఇష్టపడడు. ప్రతీ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా థియేట్రికల్ అనుభూతి కలిగించాలనే ఆలోచనలో ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఆయన చేస్తూ వస్తున్న చిత్రాలు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.
అయ్యో ఏంటి వరుణ్ తేజ్ ఇలా అయిపోతున్నాడు అని మెగా అభిమానులు బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వరుణ్ తేజ్ మాత్రం అదే తరహా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘మట్కా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తికి చేసుకున్న ఈ సినిమా, దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వరుణ్ తేజ్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు. ఆయన పాత్ర మూడు భిన్నమైన కోణాల్లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో వరుణ్ తేజ్ క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు వరుణ్ తేజ్ నుండి ఇలాంటి క్యారెక్టర్స్ ఆశించారు. ‘మట్కా’ చిత్రంలో వరుణ్ క్యారక్టర్ అంతకు మించి ఉంటుందని టాక్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ రెడీ అయిపోయింది.
రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో మూవీ టీం తో పాటు, కొంతమంది మీడియా ప్రతినిధులకు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వరుణ్ తేజ్ క్యారక్టర్ చాలా బాగుందని, ఇంత పవర్ ఫుల్ గా ఈమధ్య కాలం లో ఏ హీరో కూడా చేయలేదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చిన ఒక ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది అని, ఆడియన్స్ కి కూడా అలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పారట. కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Varun tej matka movie first review
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com