https://oktelugu.com/

Varun Tej – Lavanya Tripathi Wedding Video : విడుదలైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో..’నాటు నాటు’ సాంగ్ కి అల్లు అర్జున్,రామ్ చరణ్ స్టెప్పులు!

ఈ వీడియో లో అధిక శాతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య జరిగిన చిన్న రొమాంటిక్ సంఘటనలు ఉన్నాయి. అలాగే కుటుంబం మొత్తం కలిసి సంబరాలు చేసుకోవడం, రామ్ చరణ్, అల్లు అర్జున్ సంగీత్ ఈవెంట్ లో #RRR లోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 02:10 PM IST

    Varun Tej - Lavanya Tripathi Wedding Video

    Follow us on

    Varun Tej – Lavanya Tripathi Wedding Video : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా నిత్యం ట్రెండింగ్ లో ఉండే జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. వీళ్లిద్దరి ప్రేమ, పెళ్లి మొత్తం ఫ్యాన్స్ కి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్. సోషల్ మీడియా లో వీళ్ళ పెళ్ళికి ముందే డేటింగ్ చేసుకుంటున్నారు అని వార్తలు వస్తే అప్పట్లో అభిమానులు కేవలం రూమర్స్ అనుకున్నారు. వీళ్లిద్దరు కూడా మేము మంచి స్నేహితులం మాత్రమే, మీరు అనుకుంటున్నట్టు కాదు అని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. కానీ అకస్మాత్తుగా వీళ్ళ పెళ్లిని అధికారికంగా ప్రకటించేలోపు అందరూ షాక్ కి గురయ్యారు. నిన్న గాక మొన్ననే వీళ్లిద్దరి పెళ్లి అయ్యినట్టు అనిపిస్తుంది కదూ!..కానీ అప్పుడే ఏడాది దాటిందట. ఈ సందర్భంగా ‘ది హౌస్ ఆన్ ది క్లౌడ్స్’ అనే ఈవెంట్స్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ని ట్యాగ్ చేస్తూ ‘సరిగ్గా ఏడాది క్రితం రెండు అద్భుతమైన మనసులు ఒకటి అయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య దంపతులు చిరకాలం ఇలా సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి. వీళ్లిద్దరి పెళ్లి జరిగి ఏడాది దాటిన సందర్భంగా, పెళ్లిరోజున జరిగిన సంఘటనలను ఒక గ్లిమ్స్ గా మీ కోసం అందిస్తున్నాము’ అంటూ ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసారు.

    ఈ వీడియో లో అధిక శాతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య జరిగిన చిన్న రొమాంటిక్ సంఘటనలు ఉన్నాయి. అలాగే కుటుంబం మొత్తం కలిసి సంబరాలు చేసుకోవడం, రామ్ చరణ్, అల్లు అర్జున్ సంగీత్ ఈవెంట్ లో #RRR లోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేయడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్నటువంటి ఒక చిన్న షాట్ కూడా ఇందులో ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. మెగా అభిమానులు ఈ క్యూట్ మెమొరీస్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పబ్లిష్ చేసుకుంటున్నారు. ఇంకా పూర్తిస్థాయి వీడియో వచ్చి ఉండుంటే చాలా బాగుండేది అని అభిమానులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

    అంతకు ముందు వీళ్లిద్దరి పెళ్లి వీడియో ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కి అమ్మేశారని, అందుకే త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, మా పెళ్లి వీడియోని పబ్లిక్ గా పెట్టదల్చుకోలేదని, అది మా వ్యక్తిగతం గా ప్రైవేట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. కానీ నిహారిక కొణిదెల పెళ్లి వీడియో ని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. అలా లావణ్య, వరుణ్ పెళ్లి వీడియో కూడా పెట్టాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. కానీ అందుకు వరుణ్ తేజ్, లావణ్య జంట ఒప్పుకోలేదట. తనకి సంబంధించిన ప్రతీ విషయాన్నీ ప్రైవేట్ గా ఉంచేందుకే వరుణ్ తేజ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడట.