https://oktelugu.com/

Pushpa 2 item song : ఒకే పాటలో ఇద్దరి హీరోయిన్స్ తో డ్యాన్స్..’పుష్ప 2 : ది రూల్’ ఐటెం సాంగ్ గురించి ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్!

సినిమా షూటింగ్ ని ముంగించుకోవడానికి కేవలం ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ వారంలోనే ఈ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసి, సినిమాకి గుమ్మడికాయ కొట్టి ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనబోతుంది మూవీ టీం. అయితే ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని తీసుకోవాలి అనే విషయంలో చాలాకాలం చర్చలు నడిచాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 02:21 PM IST

    Pushpa 2 item song

    Follow us on

    Pushpa 2 item song : ఈ నవంబర్ నెల మొత్తం అల్లు అర్జున్ అభిమానులకు పండగే. వచ్చే నెల 5వ తారీఖున ‘పుష్ప 2 : ది రూల్’ విడుదల అవుతున్న సందర్భంగా, టీం నుండి అప్డేట్స్ వర్షం లాగా కురవనుంది. దేశ వ్యాప్తంగా మెగా ఈవెంట్స్ తో పాటు, ఇంటర్వ్యూస్, థియేట్రికల్ ట్రైలర్, ఇలా ఒక్కటా రెండా, ఈ నెల మొత్తం ‘పుష్ప 2’ ఫీవర్ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు. ఓవర్సీస్ లో నార్త్ అమెరికా వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ ని ముంగించుకోవడానికి కేవలం ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ వారంలోనే ఈ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసి, సినిమాకి గుమ్మడికాయ కొట్టి ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనబోతుంది మూవీ టీం. అయితే ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని తీసుకోవాలి అనే విషయంలో చాలాకాలం చర్చలు నడిచాయి.

    ముందుగా బాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ ఆడియన్స్ మంచి క్రేజ్ తో కొనసాగుతున్న శ్రద్దా కపూర్ ని తీసుకోవాలని అనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆమె పాట చేసేందుకు ఒప్పుకుంది కానీ, 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. అది కూడా పాటని కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేయాలనీ షరతు పెట్టిందట. అంత రిస్క్ చేసే సహాయం చేయడానికి ఇష్టపడని మూవీ టీం శ్రీలీల ని ఈ పాట కోసం సంప్రదింపులు జరిపారట. ఆమె కూడా ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రెమ్యూనరేషన్, డేట్స్ విషయం లో చర్చలు జరుపుతున్నారట. రెండు రోజుల్లో పాజిటివ్ న్యూస్ రావొచ్చు. డ్యాన్స్ లో అల్లు అర్జున్, శ్రీలీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వీళ్ళ డ్యాన్స్ చూడడం కోసం థియేటర్స్ కి ఆడియన్స్ క్యూ కడుతుంటారు. అలాంటిది వీళ్లిద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా కష్టమే. మరో సర్ప్రైజ్ ఏమిటంటే, ఇదే పాటలో సమంత కూడా కనిపిస్తుందట.

    ‘పుష్ప’ పార్ట్ 1 లో సమంత ‘ఉ అంటావా మామ’ పాటలో ఎలా రెచ్చిపోయి డ్యాన్స్ వేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా ఈ పాట మోత మోగిపోయే రేంజ్ లో హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్, శ్రీలీల తో కలిసి డ్యాన్స్ వేస్తే ఆడియన్స్ కి చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ ని సినిమా విడుదలకు పది రోజుల ముందు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. నవంబర్ రెండవ వారంలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ సిద్దమైందట. ఫైనల్ రీ రికార్డింగ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందట.