https://oktelugu.com/

Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ప్రూఫ్ ఇదే

Varun Tej Lavanya Tripathi Marriage: మెగా ఫామిలీ లో కెరీర్ పరంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఒక్కరు నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వరుణ్ తేజ్ అతి త్వరలోనే ఒక్క ఇంటి వాడు కాబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..తన కూతురు నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిన నాగబాబు అతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2022 / 01:21 PM IST
    Follow us on

    Varun Tej Lavanya Tripathi Marriage: మెగా ఫామిలీ లో కెరీర్ పరంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఒక్కరు నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వరుణ్ తేజ్ అతి త్వరలోనే ఒక్క ఇంటి వాడు కాబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..తన కూతురు నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిన నాగబాబు అతి త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా అతిరధ మహారధుల సమక్షం లో ఘనంగా జరిపించబోనున్నాడు అట..అయితే పెళ్లి కూతురు ఒక్క ప్రముఖ టాప్ హీరోయిన్ అని గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతూనే ఉంది..ఆమె మరెవ్వరో కాదు హీరోయిన్ లావణ్య త్రిపాఠి..వీళ్లిద్దరు ప్రేమ లో ఉన్నారు అనే వార్త ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం కూడా ఇరువురి కుటుంబ సభ్యులు ఎప్పుడో అంగీకరించారు అని.ఇక వీళ్లిద్దరికీ పెళ్లి చెయ్యడం ఒక్కటే మిగిలి ఉంది అని ప్రచారం సాగుతుంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము.

    Varun Tej Lavanya Tripathi Marriage

    వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కలిసి ఇప్పటి వరుకు మిస్టర్ మరియు అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కలిసి నటించారు..ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయాలుగా నిలిచాయి..కానీ మిస్టర్ సినిమా షూటింగ్ సమయం లోనే వరుణ్ మరియు లావణ్య మధ్య ప్రేమ చిగురించింది అని తెలుస్తుంది..ఆ తర్వాత కొన్నేళ్ళకు వీళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..లావణ్య త్రిపాఠి ఈమధ్య మెగా ఫామిలీ లో జరిగే ప్రతి కుటుంబ వేడుకలో కూడా కచ్చితంగా హాజరు అవుతూ ఉంటుంది..గతం లో జరిగిన నిహారిక పెళ్లి లో కూడా ఇంటి మనిషిలాగ దగ్గర ఉంది మరి ప్రతి పని చేసి పెట్టింది..చూడడానికి ముచ్చటగా ఉండే ఈ జంట ఒక్కటిఅయితే చూడాలి అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ ఏడాది లోనే వీళ్లిద్దరి పెళ్లి పీటలు ఎక్కనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

    Also Read: మూడోరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ‌సూలు చేసిన బీస్ట్‌.. ఇంకెంత రావాలంటే..?

    ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన హీరో గా నటించిన గని సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి మిశ్రమ స్పందన ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..వరుణ్ తేజ్ ఎంతో కస్టపడి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో కనీసం 4 కోట్ల రూపాయిల షేర్ కూడా వసూలు చెయ్యకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం..వరుస విజయాలతో కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఒక్క పెద్ద స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది అనే చెప్పాలి..ఈ సినిమాతో పాటుగానే ఆయన విక్టరీ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వం లో F3 అనే సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా వచ్చి సెన్సషనల్ హిట్ గా నిలిచినా F2 అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను ఎంత వరుకు అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

    Also Read: జిమ్ డ్రెస్‌లో ఘాటైన అందాల‌ను చూపించిన స‌మంత‌.. వీడియో వైర‌ల్‌

    Tags